తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr Movie Nominated For Golden Globe Awards In Two Categories

RRR Golden Globe: గోల్డెన్ గ్లోబ్‌కు ఆర్ఆర్ఆర్ నామినేట్‌పై ప్ర‌భాస్ రియాక్ష‌న్ ఇదే - చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌లు

13 December 2022, 7:11 IST

  • RRR Golden Globe Awards: ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హీరోలు రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌పై ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్

RRR Golden Globe Awards: ఎన్టీఆర్‌ (Ntr), రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి (SS Rajamouli) రూపొందించిన‌ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు నామినేట్ అయ్యింది. ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ చ‌రిత్ర‌ను సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

Aquaman 2 OTT: ఓటీటీలోకి హాలీవుడ్ సూప‌ర్ హీరో మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

NNS April 27th Episode: భార్యాభర్తలుగా ఇంట్లోకి అమర్ భాగీ.. మిస్సమ్మను భార్యగా ఒప్పుకోని అమర్.. పిల్లలకు మనోహరి మాయమాటలు

Chunduru Police Station Review: చుండూరు పోలీస్ స్టేష‌న్ రివ్యూ - తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం హిట్టు మూవీ ఎలా ఉందంటే?

OTT: దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే- ఓటీటీలోకి వచ్చిన న్యూ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్ప‌టికే హాలీవుడ్‌లో ప‌లు అవార్డుల‌ను ద‌క్కించుకొని ఆర్ఆర్ఆర్ స‌త్తాచాటింది . న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళి అవార్డును ద‌క్కించుకున్నాడు. లాస్ ఎంజిలాస్ ఫిల్మ్ క్రిటిక్స్‌, బోస్ట‌న్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల‌లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కీర‌వాణి అవార్డుల‌ను అందుకున్నారు.

తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్‌ గ్లోబ్ అవార్డుల‌కు ఈ సినిమా నామినేట్ అయ్యింది. రెండు కేట‌గిరీల‌లో ఆర్ఆర్ఆర్ నామినేష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ (ఉత్త‌మ విదేశీ చిత్రం) తో పాటు బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు ఈ సినిమా నామినేట్ అయ్యింది.

ఈ రెండింటిలో ఏదో ఒక కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ కు అవార్డు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని హాలీవుడ్ సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. అదే జ‌రిగితే ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలుస్తుంది. కొమురంభీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు జీవితాల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి 1920 బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇద్ద‌రు పోరాట‌యోధులు క‌లిసి బ్రిటీష్ వారిపై సాగించిన పోరాట‌మే ఈ సినిమా క‌థ‌. అలియాభ‌ట్‌, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా న‌టించారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లు పోషించారు. మార్చి 25న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ప్ర‌భాస్ అభినందనలు

ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు నామినేట్ కావ‌డంతో చిత్ర బృందానికి అగ్ర హీరో ప్ర‌భాస్ శుభాకాంక్ష‌లు అందజేశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు ఆర్ఆర్ఆర్ నామినేట్ కావ‌డం గ‌ర్వంగా అనిపిస్తోంద‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌భాస్‌ పేర్కొన్నాడు. రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.