తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu 55 Episode: సూర్య డైరెక్ట్ ఎలిమినేట్ - క‌న్నీళ్లు పెట్టుకున్న ఇనాయా

Bigg Boss 6 Telugu 55 Episode: సూర్య డైరెక్ట్ ఎలిమినేట్ - క‌న్నీళ్లు పెట్టుకున్న ఇనాయా

30 October 2022, 9:57 IST

google News
  • Bigg Boss 6 Telugu 55 Episode: బిగ్‌బాస్ నుంచి సూర్య డైరెక్ట్ గా ఎమిమినేట్ అయ్యాడు. అత‌డు హౌజ్ నుంచి వెళ్లిపోతున్న స‌మ‌యంలో ఇనాయా ఏడ్చేసింది. గీతూకు నాగార్జున గ‌ట్టిగా క్లాస్ తీసుకున్నాడు.

సూర్య
సూర్య

సూర్య

Bigg Boss 6 Telugu 55 Episode: ఈ వీకెండ్ గేమ్‌లో సూర్య డైరెక్ట్‌గా ఎలిమినేట్ అవుతున్న‌ట్లుగా నాగార్జున ప్ర‌క‌టించాడు. స్టేజ్‌పైకి ఎంట్రీ ఇస్తూనే గీతూపై ఫైర్ అయ్యాడు. చేప‌ల చెరువు టాస్క్‌లో గీతూ ఆట‌తీరుపై ఆదిరెడ్డిని రివ్యూని అడిగాడు. ఫిజిక‌ల్‌గా బాగా ఆడింద‌ని ఆదిరెడ్డి అన్నాడు.

అత‌డు మాట్లాడుతున్న స‌మ‌యంలో గీతూ మ‌ధ్య‌లో మాట్లాడ‌టంతో నాగార్జున సీరియ‌స్ అయ్యాడు. పాన‌కంలో పుడ‌క‌లో ప్ర‌తిసారి మాట్లాడ‌టం అల‌వాటు అయిపోయింద‌ని ఫైర్ అయ్యాడు. గెల‌వ‌డం కంటే ఎదుటివారిని క్రిందికి లాగ‌డంపైనే దృష్టి పెట్ట‌డం స‌రికాద‌ని అన్నాడు. గెల‌వ‌డం కోసం తాము ఆడ‌లేద‌ని గీతూ ఆదిరెడ్డి ఒప్పుకున్నారు.

గీతూ ఆట పీత‌లా ఉంద‌న్న నాగ్‌

సంచాల‌క్‌గా ఉన్న గీతూ గేమ్‌ ఆడ‌టం క‌రెక్ట్ కాద‌నిశ్రీస‌త్య‌, బాలాదిత్య‌, శ్రీహాన్ కూడా గీతూను త‌ప్పు బ‌ట్టారు. ఓడిపోయాన‌నే కోపంతోనే గీతూ అంద‌రి ఆట‌ను చెడ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించింద‌ని అన్నాడు. గేమ్ బాగా రావ‌డానికే అంద‌రిని రెచ్చ‌గొట్టిన‌ట్లు గీతూ చెప్పింది. త‌న‌ను తాను గేమ‌ర్ అంటూ స‌మ‌ర్థించుకున్న‌ది. కానీ ఆమె మాట‌ల‌తో నాగార్జున క‌న్వీన్స్ కాలేదు. గీతూ ఆట పీత‌లా ఉంద‌ని అన్నాడు. తాను గెల‌వ‌కుండా ఎదుటివారిని గెల‌వ‌నీయ‌కుండా ఆట ఆడింద‌ని అన్నాడు. ఆమె ఆట‌తీరుకు మార్కులు ఇవ్వ‌మ‌ని ఆదిరెడ్డిని నాగార్జున కోరాడు. ఆట‌కు ఐదు, సంచాల‌క్‌కు 3 మార్కులు ఇచ్చాడు ఆదిరెడ్డి.

గీతూకు ప‌నిష్‌మెంట్‌

గీతూకు ప‌నిష్‌మెంట్ ఇవ్వాల‌ని కెప్టెన్ శ్రీహాన్‌ను నాగార్జున ఆదేశించాడు. కిచెన్ క్లీనింగ్ చేసే డ్యూటీని ఆమెకు అప్ప‌గిస్తాన‌ని శ్రీహాన్ అన్నాడు. కానీ త‌న‌కు ఓసీడీ ఉంద‌ని, కిచెన్ క్లీన్ చేయ‌లేన‌ని గీతూ అన్న‌ది. ఆమె మాట‌ల‌కు మ‌రోమారు సీరియ‌స్ అయ్యాడు నాగ్‌. బిగ్‌బాస్‌కు వ‌చ్చిన త‌ర్వాత ప‌ని చేయ‌ను అంటూ కుద‌ర‌ద‌ని పేర్కొన్నాడు.

ఎవ‌రి హెల్ప్ లేకుండా బాత్‌రూమ్స్ క్లీన్స్ చేయాల‌ని ఆదేశించాడు. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింద‌ని ఆమె ఊత ప‌దాన్ని అనుక‌రిస్తూ చెప్పాడు. ఆమె భాష బాగా లేద‌ని అన్నాడు. మ‌రీనా ఆట బాగుంద‌ని నాగార్జున మెచ్చుకున్నాడు. అన‌ర్హురాలు అంటూ ఆమె ధ‌రించిన బ్యాడ్జ్ తీసేయ‌మ‌ని బాలాదిత్య‌తో చెప్పాడు. అన‌ర్హురాలు అనే బ్యాడ్జ్ ఎవ‌రికి స‌రిపోతుందో డిసైడ్ చేయాల‌ని శ్రీహాన్‌ను ఆదేశించాడు.

ఫెమినిస్ట్ సూర్య‌కు క్లాస్‌

శ్రీహాన్ ఆట‌తీరుకు శ్రీస‌త్య 10 మార్కులు ఇచ్చింది. రోహిత్‌, కీర్తి కూడా ఒక‌రికి మ‌రొక‌రు ప‌ది మార్కులు ఇచ్చుకున్నారు. రోహిత్‌, కీర్తి, ఫైమా గేమ్ కూడా బాగుంద‌ని నాగార్జున మెచ్చుకున్నాడు. వాసంతి ఆట బాగున్నా చిట్టీలు వేసుకొని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డం న‌చ్చ‌లేద‌ని నాగార్జున‌ అన్నాడు.

వాసంతిని వీక్ అంటూ సూర్య అన్న మాట‌ల‌పై నాగ్ ఫైర్ అయ్యాడు. ఫెమినిస్ట్ అని చెప్పుకునే సూర్య వీక్ అనే మాట‌లు ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ చెప్పాల‌ని అన్నాడు. ఫైమా ఓ అథ్లెట్‌లా క‌సిగా ఆడింద‌ని నాగార్జున అన్నాడు.రాజ్ గేమ్‌ను మెచ్చుకున్న నాగార్జున అన‌ర్హులు అనే బ్యాడ్జ్ తీసేశాడు. అయితే ఫైమా కామెడీ బాగుంద‌ని, కానీ దానికి ఓ హ‌ద్దు ఉంటుంద‌ని నాగార్జున అన్నాడు.

బాహుబ‌లిలా రేవంత్‌...

రేవంత్‌, ఇనాయా చేప‌ల చెరువు టాక్‌లో బాహుబ‌లిలా మారిపోయార‌ని అన్నాడు. గీతూ, కీర్తిని రేవంత్ తోసేసిన వీడియో చూపించాడు. ఆట బాగున్నా అగ్రెసివ్‌నెస్ రేవంత్‌లో ఎక్కువ‌గా ఉంటుంద‌ని అన్నాడు. ఉన్మాదిలా ఆడుతున్నావంటూ నాగార్జున అన్నాడు. ఆ త‌ర్వాత అన‌ర్హులు అనే బ్యాడ్జ్‌ను కీర్తికి ఇస్తున్న‌ట్లు శ్రీహాన్ చెప్పాడు.

సూర్య ఎలిమినేట్‌

నామినేష‌న్స్‌లో హౌజ్‌లోని అంద‌రూ కంటెస్టెంట్స్ ఉండ‌టంతో ఈ రోజు సేవింగ్స్ ప్ర‌క్రియ లేద‌ని అన్న నాగార్జున డైరెక్ట్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని చెప్పాడు. సూర్య ఎలిమినేట్ అవుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించాడు. సూర్య పేరును నాగార్జున చ‌ద‌వ‌గానే ఇనాయా గ‌ట్టిగా ఏడ్చేసింది. త‌న‌కు ధైర్యం చెప్ప‌డానికి హౌజ్‌లో ఎవ‌రూ లేర‌ని క‌న్నీళ్లు పెట్టుకున్న‌ది. ఎగ్జిట్ డోర్ ద‌గ్గ‌రే కూర్చొని చాలా స‌మ‌యం పాటు ఏడుస్తూ ఉండిపోయింది.

తదుపరి వ్యాసం