Deeksha Seth: టూ పీస్ బికినీతో రచ్చ చేస్తోన్న ప్రభాస్ హీరోయిన్.. ఓ లుక్కేయండి
23 July 2022, 6:46 IST
- టాలీవుడ్ హీరోయిన్ దీక్షా సేథ్ బికినీలో అబ్బురపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో టూ పీస్ బికినీలో కనిపించిన ఈ బ్యూటీ తన అందాల ప్రదర్శనతో విందు చేయిస్తోంది. తెలుగులో చివరగా రెబల్ సినిమాలో కనిపించిందీ బ్యూటీ.
దీక్షా సేథ్
వేదం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దీక్షా సేథ్. తొలి సినిమాతోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరనస ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ కేరీర్ అనుకున్నంత ఆశ జనకంగా సాగలేదు. వరుసగా ఫ్లాపులు పలకరించడంతో ఐరన్ లెగ్ ముద్రపడి సినిమా అవకాశాలు దూరమయ్యాయి. అయితే నెట్టింట మాత్రం తన గ్లామర్ డోసును బాగా పెంచేసింది ఈ అమ్మడు. తాజాగా టూ పీస్ బికినీలో కనిపించి.. నెటిజన్ల హృదయాలను దోచుకుంది.
అభిమానుల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బికినీ ఫొటోలతో అలరించింది. టూ పీస్ స్విమ్ సూట్‌లో దర్శనమిచ్చిన దీక్షా.. కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టింది. బీచ్ బమ్ అంటూ తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. పింక్ కలర్ బికినీలో తన నడుమొంపులను ప్రదర్శించింది. బికినీ మెరిసిన ముద్దుగుమ్మ అభిమానులకు అందాల విందును అందించింది.
ఇప్పటికీ ఆఫర్లు కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు గ్లామర్ డోస్‌తో హీట్ పెంచేస్తోంది. ఈ ఫొటోలకు నెటిజన్లు కూడా విశేషంగా స్పందింస్తున్నారు. అందంతో చంపేస్తుందంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టగా.. అద్భుతంగా ఉందంటూ మరొకరు స్పందించారు. హాట్ లుక్స్‌తో హీట్ పెంచుతుందని ఇంకొకరు పోస్ట్ పెట్టారు.
తెలుగలో వేదం తర్వాత మిరపకాయ్ లాంటి హిట్ సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ. అనంతరం గోపీచంద్ సరసన వాంటెడ్, మంచు మనోజ్‌తో ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా లాంటి చిత్రాల్లో నటించింది. చివరగా తెలుగులో ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో కనిపించిందీ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి అడపా దడపా తమిళం, హిందీల్లో సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా ఈమెకు కలిసి రాలేదు. చివరగా 2016లో బాలీవుడ్‌లో సాత్ కదమ్ అనే చిత్రంలో మెరిసిందీ బ్యూటీ.
టాపిక్