RDX: ఈ మలయాళ మూవీ కలెక్షన్లు అదుర్స్.. అంతగా ఇందులో ఏముంది?
08 September 2023, 12:45 IST
RDX: Robert Dony Xavier: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చెప్పలేం. ఇటీవల కన్నడ, మలయాళ చిత్రాలు బీభత్సమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో మరో మలయాళ చిత్రం 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' చేరింది. అంతలా ఈ సినిమా ప్రత్యేకత ఏంటని చూస్తే..
స్టార్ హీరోలకు ధీటుగా ఆర్డీఎక్స్
RDX Collection: మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటమే కాదు అవి ఇతర సినీ పరిశ్రమల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంటాయి. అలా తాజాగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సినిమా 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్'. కొత్త డైరెక్టర్ నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఆ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. అలాగే మహిమా నంబియార్, ఐమా సెబాస్టియ్, లాల్, బాబు ఆంటోని, మాలా పార్వతి కీలక పాత్రలు పోషించారు. సోఫియా పాల్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై ఇప్పటికీ మంచి టాక్ తెచ్చుకుంటోంది.
వరల్డ్ వైడ్‍గా
'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' యాక్షన్ థ్రిల్లర్‍గా వచ్చి యూత్‍తో పాటు మలయాళం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల బీభత్సం సృష్టించిన కింగ్ ఆఫ్ కోత మూవీ వసూళ్లను త్వరలో దాటేందుకు సిద్ధంగా ఉంది ఆర్‍డీఎక్స్ మూవీ. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమాకు ఒక కేరళలోనే రూ. 40 కోట్ల వసూళ్లు వచ్చాయి. అలాగే ఐర్లాండ్ వంటి దేశాల్లో కూడా సత్తా చాటుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్‍గా రూ. 75 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. కానీ, ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‍లోకి మాత్రం చేరుకోలేదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
14 రోజుల్లో
ఎందుకంటే.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ సినిమా కేరళలో 300కుపైగా థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది. ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఆర్డీఎక్స్ షారుక్ జవాన్‍కు పోటీగా నిలబడలేదని తెలుస్తోంది. కానీ, షారుక్ ఖాన్ జవాన్, రజనీకాంత్ జైలర్ వంటి పెద్ద స్టార్స్ సినిమాలను కూడా తట్టుకుని రెండు వారాలుగా (14 రోజుల్లో) మంచి కలెక్షన్స్ సాధించిన 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' దమ్మున్న సినిమాగా మలయాళంలో నిలబడింది. ఈ సినిమాను, మూవీ టేకింగ్, తదితర అంశాలపై ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ వంటి తారలు ప్రశంసలు కురిపించారు.
ఓటీటీ పార్టనర్
క్రైమ్, డ్రామా, అద్భుతమైన టేకింగ్, నటీనటుల పర్ఫామెన్స్, బీజీఎమ్ వంటి ఇతర అంశాలతో 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' సినిమాకు మలయాళీలు నీరాజనం పడుతున్నారు. అందుకే సినిమాను సెలబ్రిటీలు సైతం ప్రంశసిస్తున్నారు. ఈ కారణాలతోనే షారుక్, రజనీకాంత్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లకు పోటీ ఇస్తుంది. ఇక 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. అక్టోబర్‍లో నెట్‍ఫ్లిక్స్ లో ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్ (RDX: Robert Dony Xavier OTT) స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
టాపిక్