తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Movie With Anupama: రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్.. త్వరల పట్టాలెక్కనున్న ప్రాజెక్టు!

Ravi Teja movie with Anupama: రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్.. త్వరల పట్టాలెక్కనున్న ప్రాజెక్టు!

15 September 2022, 21:52 IST

google News
    • Anupama Parameswaran Next Movie: అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రాన్ని రవితేజ సరసన చేయనుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
రవితేజ-అనుపమ పరమేశ్వరన్
రవితేజ-అనుపమ పరమేశ్వరన్

రవితేజ-అనుపమ పరమేశ్వరన్

Ravi Teja Movie with Anupama Parameswaran: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ.. ధమాకా అనే మరో సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇది కాకుండా మెగా 154, టైగర్ నాగేశ్వరారవు లాంటి సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం రవితేజ గురించి మరో అప్డేట్ వచ్చింది. ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో ఓ సినిమా చేసేందుకు రవితేజ సిద్ధపడ్డాడట.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పేరు పెట్టని ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఈగిల్ అనే టైటిల్‌లో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో ఉన్నాడని టాక్. ఇందుకు కొంత సమయం పడుతుందని, ఒక్కసారి స్క్రిప్టు వర్క్ పూర్తయిన తర్వాత చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.

ప్రస్తుతాని ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే రవితే, అనుపమ కలిసి పనిచేయబోతున్నట్లు మాత్రం వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే త్వరలో మన మాస్ మహారాజా పక్కన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను చూడొచ్చు.

ఈ ఏడాది అనుపమ పరశ్వేరన్‌కు బాగా కలిసొచ్చింది. ఇటీవలే కార్తీకేయ 2 సినిమాతో పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ.. ఫుల్ బిజీగా ఉంది. కార్తికేయ 2 చిత్రం హిందీ బెల్టులో విపతీంగా ఆదరణ పొందింది. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇది కాకుండా బటర్ ఫ్లై అనే సినిమాతో పాటు 18 పేజెస్ అనే మరో చిత్రంలో అనుపమ పరశ్వేరన్ చేస్తోంది.

తదుపరి వ్యాసం