తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Khiladi Trailer | రవితేజ 'ఖిలాడి' ట్రైలర్.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కు!

Khiladi Trailer | రవితేజ 'ఖిలాడి' ట్రైలర్.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కు!

Manda Vikas HT Telugu

07 February 2022, 19:31 IST

google News
    • ఎప్పుడూ ఒకే టీమ్‌కి ఆడటానికి నేషనల్ ప్లేయర్‌ని కాదు.. ఐపీఎల్ ప్లేయర్.. ఎవరు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను… రవితేజ 'ఖిలాడి' మూవీలోని డైలాగ్ ఇది.  ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.. ఎలా ఉందో చూడండి.
రవితేజ 'ఖిలాడి' ట్రైలర్
రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ (Youtube Screengrab)

రవితేజ 'ఖిలాడి' ట్రైలర్

Khiladi | మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్లే- స్మార్ట్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకి ఆ టైటిల్, ట్యాగ్ లైన్ సరిగ్గా సెట్ అయ్యాయి అనిపిస్తుంది. 'ఎప్పుడూ ఒకే టీమ్‌కి ఆడటానికి నేషనల్ ప్లేయర్‌ని కాదు.. ఐపీఎల్ ప్లేయర్.. ఎవరు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్, సినిమా నేపథ్యం ఎలా ఉండబోతుందో రుచిచూపింది. ట్రైలర్‌లో ప్రధానంగా రెండు అంశాలు చూపించారు. ఒకటి మనీ లాండరింగ్ లాంటి క్రైమ్ ట్రాక్ కాగా, మరొకటి ఫ్యామిలీ నేపథ్యంతో సాగే క్లాస్ ఎంటర్‌టైన్మెంట్. మొత్తంగా ఇది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే అసలు సిసలైన రవితేజ సినిమా.

ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి కాగా, మరొకరు 'గద్దలకొండ గణేష్' మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ఫేమ్ డింపుల్ హయాతి. వీరిద్దరి గ్లామర్ సినిమాకి మరో ఎట్రాక్షన్. అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మాస్ బీట్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కు ఇస్తున్నాయి. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ కూడా మూవీ మీద అంచనాలను మరింత పెంచేసింది. చూడండి ట్రైలర్ ఎలా ఉందో..

#Khiladi​ Movie Trailer

ఖిలాడి మూవీలో కూడా రవితేజ ఎప్పట్లాగే యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇందులో కూడా డబుల్ రోల్ పోషించినట్లు వినికిడి. విలన్ పాత్రలో అర్జున్ సర్జా నటించగా.. ఉన్ని ముకుందన్, నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రిషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, భరత్ రెడ్డి, కేశవ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఖిలాడికి చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. 'వీర' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. పెన్ మూవీస్ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో ' ఖిలాడి విడదలవుతోంది.

తదుపరి వ్యాసం