Dhamaka Second Single: ధమాకా నుంచి మరో పాట.. 'బాడీ లోకల్.. మైండ్ గ్లోబల్' అంటున్న మాస్ మహా రాజా
23 September 2022, 21:26 IST
- Ravi Teja Dhamaka Second Single: రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ సినిమా నుంచి మరో పాట వచ్చేసింది. మాస్ రాజా అంటూ సాగే ఈ పాటను నకాశ్ నజీజ్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రీ రాశారు.
మాస్ మహారాజ రవితేజ
Dhamaka Second Single Released: మాస్ మహారాజ రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ.. త్వరలో "ధమాకా"తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. త్రినిథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండో పాటను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్.
మాస్ రాజా అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. రవితే హుషారైన స్టెప్పులు, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌కు అదిరిపోయింది. కథనాయకుడి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ గీతంలో బాడీ లోకల్, మైండ్ గ్లోబల్ తదితర చరణాలు రవితేజ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపేలా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియోలో రవితేజ వేసిన కొన్ని స్టెప్పులను బట్టి చూస్తే మన మాస్ మహారాజా స్టెప్పులు ఇరగదీసినట్లు తెలుస్తోంది.
మాస్ రాజా అంటూ సాగే ఈ పాటను నకాశ్ అజీజ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. రవితేజ శైలికి తగినట్లుగా మంచి ఊపు తెచ్చే విధంగా ఈ సాంగ్ సాగింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు.
టాపిక్