తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mirapakay Movie Re Release Date: రవితేజ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - రీ రిలీజ్ కానున్న మిర‌ప‌కాయ్‌

Mirapakay Movie Re Release Date: రవితేజ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - రీ రిలీజ్ కానున్న మిర‌ప‌కాయ్‌

19 January 2023, 7:08 IST

google News
  • Mirapakay Movie Re Release Date: ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న అత‌డి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతున్న‌ది. ఆ సినిమా ఏదంటే...

ర‌వితేజ
ర‌వితేజ

ర‌వితేజ

Mirapakay Movie Re Release Date: రీ రిలీజ్ సినిమాలు థియేట‌ర్ల‌లో భారీగా వ‌సూళ్ల‌ను రాబడుతుండ‌టంతో గ‌తంలో విజ‌య‌వంత‌మైన ప‌లు సినిమాల్ని మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత‌లు రెడీ అవుతోన్నారు. ఈ జాబితాలో ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా చేరింది. ర‌వితేజ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మిర‌ప‌కాయ్ సినిమా జ‌న‌వ‌రి 26న రీ రిలీజ్ కానుంది.

ర‌వితేజ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌తో ర‌వితేజ జోరుమీదున్నాడు. ఆ క్రేజ్ మిర‌ప‌కాయ్ రీ రిలీజ్ కూడా క‌లిసివ‌స్తోంద‌ని నిర్మాత‌లు భావిస్తోన్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో రూపొందిన మిర‌ప‌కాయ్ 2011లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇందులో ర‌వితేజ కామెడీ టైమింగ్‌, మాస్ అంశాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 113 సెంట‌ర్స్‌లో యాభై రోజులు ఆడింది.

ఇందులో రిచా గంగోపాధ్యాయ‌, దీక్షా సేథ్ హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌కాష్ రాజ్ విల‌న్‌గా క‌నిపించారు. మిర‌ప‌కాయ్ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. కాగా ప్ర‌స్తుతం ర‌వితేజ రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేనితో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేయ‌బోతున్నాడు ర‌వితేజ.

తదుపరి వ్యాసం