తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Babu Asalu Movie: ఈ టీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న‌ తెలుగు సినిమాలు ఇవే

Ravi Babu Asalu Movie: ఈ టీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న‌ తెలుగు సినిమాలు ఇవే

19 March 2023, 12:02 IST

  • Ravi Babu Asalu Movie:ఈ టీవీ విన్ ఓటీటీలో థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

పంచ‌తంత్రం, అస‌లు
పంచ‌తంత్రం, అస‌లు

పంచ‌తంత్రం, అస‌లు

Ravi Babu Asalu Movie: క‌రోనా త‌ర్వాత డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌కు క్రేజ్ పెర‌గ‌డంతో డైరెక్ట్‌గా స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవుతోన్నాయి. తాజాగా ఈ టీవీ విన్ ఓటీటీలో థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

ప్ర‌యోగాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌విబాబు న‌టిస్తూ నిర్మించినఅస‌లు సినిమా ఏప్రిల్ 5వ తేదీన ఈ టీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఉద‌య్‌, సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఓ ప్రొఫెస‌ర్ మ‌ర్డ‌ర్ చుట్టూ ఈ సినిమా సాగిన‌ట్లుగా ట్రైల‌ర్‌లో క‌నిపిస్తోంది.

అస‌లు సినిమాతో పాటు రైటో లెఫ్టో సినిమా మార్చి 22న ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు కూర‌పాటి వేణుగోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ముగ్గురు యువ‌కుల జీవితాల నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌నుంది.

ఈ రెండు సినిమాల‌తో పాటుగా బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన పంచ‌తంత్రం మార్చి 22న రిలీజ్ కానుంది. ఐదు క‌థ‌ల స‌మాహారంగా రూపొందిన ఈసినిమాకు హ‌ర్ఫ పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.