తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించిన రవీనా టండన్

తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించిన రవీనా టండన్

11 February 2022, 18:59 IST

google News
    • కొడుకు స్థానంలో కూతురు అయిన రవీనా తండ్రికి అంత్యక్రియలను నిర్వహిస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అంత్యక్రియల్లో రవీనా భర్తతో పాటు సోదరుడు రాజీవ్ టండన్ కూడా కనిపించారు.
Raveena Tandon'
Raveena Tandon'

Raveena Tandon'

బాలీవుడ్ నటి రవీనా టండన్ తండ్రి,దర్శకనిర్మాత రవి టండన్ శుక్రవారం కన్నుమూశారు. తండ్రికి రవీనా టండన్ దహన సంస్కారాలను నిర్వహించింది. కొడుకు స్థానంలో కూతురు అయిన రవీనా తండ్రికి అంత్యక్రియలను నిర్వహిస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అంత్యక్రియల్లో రవీనా భర్తతో పాటు సోదరుడు రాజీవ్ టండన్ కూడా కనిపించారు. తండ్రి మరణించిన విషయాన్ని తెలియజేస్తూ ఉదయం భావోద్వేగభరితంగా ట్వీట్ చేసింది రవీనా టండన్. ‘మీరు ఎప్పటికీ నాతో కలిసి అడుగులు వేస్తూనే ఉంటారు. నేను మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటా. మీ చేయిని ఎప్పటికీ వదలను. లవ్ యూ నాన్న’ అంటూ తండ్రితో కలిసి నడుస్తున్న పాత ఫొటోను పోస్ట్ చేసింది. 

గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో రవి టండన్ బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో దర్శకనిర్మాతగా రవి టండన్ మంచి పేరు సంపాదించుకున్నారు. అమితాబ్ బచ్చన్ తో మజ్ బూర్, ఖుద్ధార్ సినిమాల్ని తెరకెక్కించారు. నజ్ రానా, ఏక్ మే ఔర్ ఏక్ తూ , జూతా కహీన్ కా, ఖేల్ ఖేల్ మే వంటి సినిమాలతో దర్శకుడిగా పెద్ద విజయాల్ని అందుకున్నారు. నిర్మాతగా, నటుడిగా రాణించారు. రవి టండన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

తదుపరి వ్యాసం