తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika On Vijay Deverakonda: విజయ్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి కలిసి నటించడంపై నేషనల్ క్రష్ క్లారిటీ

Rashmika on Vijay deverakonda: విజయ్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి కలిసి నటించడంపై నేషనల్ క్రష్ క్లారిటీ

04 January 2023, 12:22 IST

    • Rashmika on Vijay deverakonda: విజయ్ దేవరకొండ గురించి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో కలిసి పనిచేయడంపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రంలో పనిచేశారు.
రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ
రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ

రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ

Rashmika on Vijay deverakonda: విజయ్ దేవరకొండ-రష్మికా మందన్నా మధ్య ఏదో ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, కలిసి వెకేషన్‌కు కూడా వెళ్లారని పలు ఊహాగానాలు వచ్చాయి. ఇటీవలే న్యూ ఇయర్‌కు ఇద్దరూ ఒకే బ్యాక్ గ్రౌండ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన రిలేషన్‌షిప్ రూమర్లకు మరింత ఊతమిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రౌడీ హీరోతో కలిసి మళ్లీ సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు అదిరిపోయే సమాధానమిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

"ఇప్పటికైతే లేదనే చెబుతాను. కానీ ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం ఇది జరుగుతుందని భావిస్తున్నా. మేమిద్దరం తెరపై కనిపించి చాలా రోజులవుతుందని, మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని మా శ్రేయోభిలాషులు, స్నేహితులు నాకు మెసేజులు పెట్టారు. మా వ్యక్తిత్వాలకు అనుగుణంగా ఉండే స్క్రిప్టు కోసం వేచి ఉండాలనుకుంటున్నాం. కథకు పూర్తిగా న్యాయం చేయాలనుకుంటున్నాం. విజయ్‌తో పనిచేయడం నాకు కూడా ఎంతో ఇష్టం. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల నుంచి చాలా మెరుగుపడ్డానని భావిస్తున్నాను. నా పర్ఫార్మెన్స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. అతడి ప్రతిస్పందన కోసం చూస్తున్నాను. ఇది వచ్చే ఏడాది లేదా ఆపైన జరుగుతుందని ఆశిస్తున్నాను." అని రష్మిక స్పష్టం చేసింది.

వర్క్ విషయానికొస్తే రష్మిక బాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్‌తో పుష్ప-2లోనూ నటిస్తుంది. గత ఆగస్టులో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. రెండో భాగానికి కూడా సుకుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మరోపక్క విజయ్ దేవరకొండ కూడా లైగర్ ఫ్లాపు నుంచి కోలుకుని శివ నిర్వాణ చిత్రంతో బిజీగీ ఉన్నాడు. ఖుషి అనే పేరుతో రానున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. సమంతా అనారోగ్యం కారణంగా ఈ సినిమా గత జూన్ నుంచి తాత్కాలికంగా ఆగింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం