తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna Ban In Kannada: మ‌రో వివాదంలో ర‌ష్మిక - క‌న్న‌డ ఇండ‌స్ట్రీ ఆమెను బ్యాన్ చేయ‌నుందా

Rashmika Mandanna Ban in Kannada: మ‌రో వివాదంలో ర‌ష్మిక - క‌న్న‌డ ఇండ‌స్ట్రీ ఆమెను బ్యాన్ చేయ‌నుందా

25 November 2022, 7:56 IST

google News
  • Rashmika Mandanna Ban in Kannada: ర‌ష్మిక మంద‌న్న మ‌రో వివాదంలో చిక్కుకుంది. మాతృభాష క‌న్న‌డ ఫ్యాన్స్‌ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ర‌ష్మిక‌పై వారి ఆగ్ర‌హానికి కార‌ణం ఏమిటంటే...

ర‌ష్మిక మంద‌న్న
ర‌ష్మిక మంద‌న్న

ర‌ష్మిక మంద‌న్న

Rashmika Mandanna Ban in Kannada: సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిన త‌ర్వాత హీరోహీరోయిన్లు త‌ర‌చుగా వివాదాలు ఎదుర్కొంటున్నారు. తొంద‌ర‌పాటుతో కొన్నిసార్లు వారు మాట్లాడిన స‌మ‌స్య‌ల‌కు దారితీస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న అలాంటి క‌ష్టాల‌నే ఎదుర్కొంటోంది. త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ప్రొడ‌క్ష‌న్ హౌజ్ పేరును చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో మాతృభాష ప్రేక్ష‌కుల నుంచి ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

2016లో రూపొందిన క‌న్న‌డ చిత్రం కిరిక్ పార్టీతో ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ర‌క్షిత్‌శెట్టి హీరోగా న‌టించిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిల‌వ‌డంతో ర‌ష్మిక‌కు తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బిజీ యాక్ట‌ర్‌గా మార‌డంతో మాతృభాష క‌న్న‌డంలో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేదు ర‌ష్మిక మంద‌న్న‌. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు తొలి అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును ర‌ష్మిక మంద‌న్న చెప్ప‌లేదు.

కిరిక్ పార్టీ సినిమాలో అవ‌కాశం వ‌చ్చిందంటూ సోకాల్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ నుంచి వ‌చ్చిన కాల్‌ను ఫ్రాంక్ అనుకున్నాన‌ని ఈ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ప్రొడ‌క్ష‌న్ హౌజ్ పేరు చెప్ప‌కుండా సోకాల్డ్ అంటూ పేర్కొన‌డం వివాదానికి కార‌ణ‌మైంది. కిరిక్ పార్టీ సినిమాను ర‌క్షిత్ శెట్టికి చెందిన ప‌ర‌మ్‌వ‌హ స్టూడియోస్ నిర్మించింది. కిరిక్ పార్టీ త‌ర్వాత ర‌క్షిత్‌శెట్టితో ర‌ష్మిక మంద‌న్న ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది.

కానీ మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా త‌మ ఎంగేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేసుకున్నారు. ర‌క్షిత్‌శెట్టికి చెందిన బ్యాన‌ర్ కావ‌డంతోనే ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక మంద‌న్న ప్రొడ‌క్ష‌న్ హౌజ్ పేరు చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం త‌న‌ను హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన బ్యాన‌ర్‌ను ర‌ష్మిక చుల‌క‌న చేసి మాట్లాడింద‌ని ఫైర్ అవుతోన్నారు.

ర‌ష్మిక మంద‌న్న‌ను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ పోస్ట్‌లు పెడుతోన్నారు. ప్రొడ‌క్ష‌న్ హౌజ్ వివాదంతో పాటు రిలీజైన క‌న్న‌డ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంతారా సినిమాను చూడ‌లేదంటూ ఇటీవ‌ల ర‌ష్మిక మంద‌న్న స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం కూడా క‌న్న‌డ ఫ్యాన్స్‌కు ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ర‌ష్మిక మంద‌న్న‌పై బ్యాన్‌ప‌డితే విజ‌య్ వార‌సుడు సినిమాకు క‌న్న‌డంలో రిలీజ్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

తదుపరి వ్యాసం