తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranveer Singh Kisses Deepika Padukone: అందరూ చూస్తుండగానే దీపికకు రణ్‌వీర్ ముద్దులు.. అదీ స్టేజ్‌పైనే!

Ranveer Singh kisses Deepika Padukone: అందరూ చూస్తుండగానే దీపికకు రణ్‌వీర్ ముద్దులు.. అదీ స్టేజ్‌పైనే!

31 August 2022, 8:25 IST

google News
    • Ranveer Singh kisses Deepika Padukone: బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో రణ్‌వీర్‌కు ఉత్తమనటుడిగా ఫిల్మ్ అవార్డు లభించింది. దీపికా పదుకొణె చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకున్న రణ్‌వీర్.. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.
రణ్‌వీర్-దీపికా ముద్దులు
రణ్‌వీర్-దీపికా ముద్దులు (Instagram)

రణ్‌వీర్-దీపికా ముద్దులు

బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు రాత్రి జరిగింది. ఈ వేడుకకు హిందీ సినిమా ప్రముఖులు, దర్శకనిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు రణ్‌వీర్ సింగ్ దక్కించుకున్నాడు. 83 సినిమాలో ఆయన నటనకు గానూ ఈ పురస్కారం లభించింది. రెడ్ సూట్‌లో దర్శనమిచ్చిన రణ్‌వీర్.. తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి హాజరయ్యాడు. అయితే ఈ అవార్డు కూడా తన భార్య దీపికా చేతుల మీదుగానే తీసుకున్నాడు రణ్‌వీర్. అయితే అంతటితో ఆగకుండా పురస్కారం తీసుకున్న తర్వాత.. దీపికాతో ముద్దు, కౌగిలింతలతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

83 సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ అవార్డు తీసుకునేందుకు రణ్‌వీర్ సింగ్ స్టేజ్ పైకి వస్తాడు. అయితే ఆ అవార్డును ఇచ్చేందుకు దీపికా పదుకొణె అక్కడకు వస్తుంది. పురస్కారం తీసుకున్న తర్వాత ఆమెను హగ్ చేసుకొని బుగ్గపై ముద్దు పెట్టాడు రణ్‌వీర్. దీంతో ఒక్కసారిగా వీరిద్దరితో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వులు చిందించారు. అవార్డు తీసుకున్న తర్వాత రణ్‌వీర్ తనదైన శైలిలో జోకులు పేల్చాడు. నేను నిన్ను ఎలా విష్ చేస్తానంటే.. దీపికా చేత రణ్‌వీర్ అవార్డు అందుకున్నాడు అని చమత్కరించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి దీపికా పదుకొణె సింపుల్ వేషధారణతో ఆకట్టుకుంది. డెనిమ్ బ్లూ షర్టును ధరించిన దీపికా.. వైట్ షూలను వేసనుకుని చూపరులను ఆకర్షించింది. రణ్‌వీర్ రెడ్ సూట్‌లో కనిపించి ఎప్పటిలాగే వైవిధ్యంగా అలరించాడు.

83 సినిమా 1983 క్రికెట్ ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్ర పోషించాడు. దీపికా పదుకొణె ఇందులో కపిల్ భార్య రోహి భాటియా పాత్రలో కనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరించింది.

ఈ సినిమా తర్వాత ఈ ఏడాది జయేషిభాయ్ జోర్దార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు రణ్‌వీర్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ అనే మరో చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆలియా భట్, జయా బచ్చన్, దర్మేంద్ర, షబానా అజ్మీ తదితరులు నటిస్తున్నారు.

తదుపరి వ్యాసం