తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Day 1 Collection: స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్.. రెండో హీరోగా ఘనత

Skanda Day 1 Collection: స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్.. రెండో హీరోగా ఘనత

Sanjiv Kumar HT Telugu

27 September 2023, 17:10 IST

  • Skanda Day 1 Expected Collection: రామ్ పోతినేని కెరీర్‍లోనే హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా వస్తున్న సినిమా స్కంద. ది అటాకర్ అనేది క్యాప్షన్. గురవారం (సెప్టెంబర్ 28)న విడుదల కానున్న స్కంద మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

స్కందకు భారీ కలెక్షన్స్.. రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్.. రెండో హీరోగా ఘనత
స్కందకు భారీ కలెక్షన్స్.. రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్.. రెండో హీరోగా ఘనత

స్కందకు భారీ కలెక్షన్స్.. రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్.. రెండో హీరోగా ఘనత

Skanda Day 1 Box Office Prediction: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద. రామ్‍కు జంటగా శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా చేశారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూట్ ఊర్వశీ రౌతెలా కల్ట్ మామ స్పెషల్ సాంగ్‍తో ఐటమ్ బాంబ్‍ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‍పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

స్కంద ప్రీ రిలీజ్ బిజినెస్

ఉస్తాద్ రామ్ పోతినేని స్కంద సినిమాకు సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే స్కందకు ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‍గా స్కంద మూవీకి రూ. 46. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఇది రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్ బిజినెస్ అని తెలుస్తోంది.

ఏరియాల వారీగా బిజినెస్

రామ్ పోతినేని స్కంద మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో రూ. 13 కోట్లు, సీడెడ్‍లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‍లో 19.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా ఏపీ, తెలంగాణలో స్కంద చిత్రానికి రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‍లో 2.20 కోట్ల మార్కెట్ అయింది.

స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్

అన్ని ఏరియాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా స్కంద సినిమా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ (Skanda Total WW Business) చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా ఫిక్స్ అయింది. అంటే స్కందకు రూ. 47కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ వస్తేనే హిట్‍గా నిలుస్తుంది. ఇదిలా ఉంటే స్కంద సినిమాకు సెప్టెంబర్ 28 విడుదలైన రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

స్కంద వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇదే నిజమైతే టైర్ 2 హీరోల్లో నాని దసరా తర్వాత అంత కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా స్కంద నిలుస్తుంది. ఇక రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబో స్కంద మూవీకి తొలి రోజున రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ చంద్రముఖి 2 గట్టి పోటి ఇవ్వనుంది. దీంతో స్కందకు ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 10 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 10 కోట్లతో స్కంద మూవీ డే 1 ఓపెనింగ్ కానుందని అంచనా. మరి లాంగ్ వీకెండ్ రన్‍లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం