Skanda Day 6 Collection: సగానికి పడిపోయిన స్కంద కలెక్షన్స్.. వచ్చింది ఇంతే.. హిట్ కష్టమే!
04 October 2023, 12:20 IST
Skanda 6 Days World Wide Collection: ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల హీరోయిన్లుగా చేసిన మొదటి సినిమా స్కంద. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గుతున్నాయి. ఇలా స్కంద 6 రోజుల కలెక్షన్స్ చూస్తే..
స్కంద 6 రోజుల కలెక్షన్స్
Skanda 6 Days Collection: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మేజర్ బ్యూటి సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన సినిమా స్కంద. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. అయితే, సెప్టెంబర్ 28న విడుదలైన స్కంద మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
డే 6 కలెక్షన్స్
స్కంద మూవీకి 6వ రోజు కూడా కలెక్షన్స్ సగానికి పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 33 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో రూ. 1.02 కోట్ల షేర్, రూ. 1.65 కోట్ల గ్రాస్ వచ్చింది. గత ఐదు రోజులతో పోలిస్తే ఆరో రోజునే అతి తక్కువగా కలెక్షన్స్ వచ్చాయి.
6 డేస్ కలెక్షన్స్
స్కంద చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులకు కలిపి నైజాంలో రూ. 9.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, గుంటూరులో రూ. 2.30 కోట్లు, కృష్ణాలో రూ. 1.27 కోట్లు, నెల్లూరులో రూ. 1.03 కోట్లతో మొత్తంగా రూ. 23.59 కోట్ల షేర్, రూ. 38.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.38 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్లు రాబట్టింది.
హిట్ కష్టమే!
స్కంద సినిమా 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 27.72 కోట్ల షేర్, రూ. 47.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, స్కందకు రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు కాగా.. దాన్ని పూర్తి చేయడానికి ఇంకా రూ. 19.28 కోట్లు రావాల్సి ఉంది. అవి వస్తేనే స్కంద సినిమా క్లీన్ హిట్ టాక్ తెచ్చుకుని.. లాభాలు గడించే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం కలెక్షన్ల లెక్కలు చూస్తే వాటిని చేరుకోవడం స్కందకు కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.