తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Gopal Varma Degree: రాంగోపాల్ వర్మ బీటెక్ పాసయ్యాడు.. 37 ఏళ్ల తర్వాత అందిన డిగ్రీ పట్టా

Ram Gopal Varma Degree: రాంగోపాల్ వర్మ బీటెక్ పాసయ్యాడు.. 37 ఏళ్ల తర్వాత అందిన డిగ్రీ పట్టా

Hari Prasad S HT Telugu

15 March 2023, 21:18 IST

    • Ram Gopal Varma Degree: రాంగోపాల్ వర్మ బీటెక్ పాసయ్యాడు. నిజానికి అతడు పాసైన 37 ఏళ్ల తర్వాత వర్మకు అతని డిగ్రీ పట్టా అందడం విశేషం. ఈ విషయాన్ని వర్మనే బుధవారం (మార్చి 15) తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Degree: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీకి రాక ముందు బీటెక్ చదివాడు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి అతడు ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అయితే ఎప్పుడూ సినిమాలపైనే ధ్యాస ఉంచే వర్మ.. ఏదో బీటెక్ పాసయ్యాడంటే పాసయ్యాడన్నట్లు మొక్కుబడిగా ముగించాడు. అందుకే కనీసం అప్పుడు తాను పూర్తి చేసిన డిగ్రీ పట్టా కూడా తీసుకోలేదు.

ట్రెండింగ్ వార్తలు

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

ఎప్పుడో 1985లోనే వర్మ తన బీటెక్ పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత అతనికి డిగ్రీ పట్టా అందింది. ఈ విషయాన్ని వర్మనే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. తనకు సివిల్ ఇంజినీరింగ్ చేయడం ఇష్టం లేక ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని అతడు అనడం విశేషం.

"నేను పాసైన 37 ఏళ్ల తర్వాత బీటెక్ డిగ్రీ అందుకోవడం సూపర్ థ్రిల్ గా ఉంది. 1985లో నేను దానిని తీసుకోలేదు. ఎందుకంటే సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయడం ఎప్పుడూ నాకు ఇష్టం లేదు. థ్యాంక్యూ నాగార్జున యూనివర్సిటీ" అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

1985లో బీటెక్ పాసైనట్లు ఈ డిగ్రీ సర్టిఫికెట్లో స్పష్టంగా ఉంది. వర్మ సెకండ్ క్లాస్ లో బీటెక్ పాసయ్యాడు. ట్విటర్ లో 58 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న వర్మ ఈ పోస్ట్ చేయగానే వేల కొద్దీ లైక్స్ వచ్చాయి. ఎంతో మంది సోషల్ మీడియాలో వర్మకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేశారు.

నువ్వు సివిల్ ఇంజినీరింగ్ చేశావా.. అందుకే సినిమాల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగులను ఎక్కువగా ఉపయోగంచావా అని ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం. నేనూ సెకండ్ క్లాస్ లోనే బీటెక్ పాసయ్యాను.. మీలాగే నేనూ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నా అని మరో యూజర్ అన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం