RGV Questions to TS Govt: కుక్కల దాడి ఘటన.. డియర్ గవర్నమెంట్ అంటూ ఆర్జీవీ 5 ప్రశ్నలు
25 February 2023, 11:07 IST
- child killed by street dogs in hyderabad: అంబర్ పేట ఘటన నేపథ్యంలో తెెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు డైరెక్టర్ ఆర్టీవీ. తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
దర్శకుడు ఆర్టీవీ
RGV Questions to Telangana Govt: హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కక్కుల బెడద నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా విచారణ జరిపిన హైకోర్టు కూడా... ప్రభుత్వ చర్యలను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే... ఈ ఘటన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తన ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆర్టీవీ ఐదు ప్రశ్నలు...
నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై సరైన సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు ఆర్జీవీ. ఈ మేరకు ఐదు ప్రశ్నలను సంధిస్తున్నట్లు చెప్పాడు. వీటికి సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు.
- డియర్ గవర్నమెంట్..... ఈ ఘటన నేపథ్యంలో కుక్కల బెడద నియంత్రణకు తక్షణ చర్యలు ఏం తీసుకున్నారు...?
- చిన్నారుల ప్రాణాల కంటే కుక్కలే మీకు ముఖ్యమైతే వాటిని దత్తత తీసుకొని డాగ్ షెల్టర్లకు తరలించవచ్చు. కానీ ప్రజలనే దత్తత తీసుకోమని చెప్పటం ఏ మాత్రం సరికాదు.
- 4 కోట్లకు పైగా ఉన్న కుక్కల సంరక్షణ విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వద్ద వనరులు లేకపోతే... జంతు ప్రేమికుల నుంచే ఆ డబ్బులను తీసుకోవచ్చు కదా..?
- అన్ని కుక్కలకు స్టిరిలైజేషన్ చేస్తామనేది సుదీర్ఘమైన ప్రక్రియ. అది కేవలం వాటి సంఖ్యను తగ్గించేందుకు చేసే ప్రయత్నం మాత్రం. కానీ ప్రస్తుతం అవి జనాలను చంపేస్తున్నాయి..? ఈ విషయంలో ఏ చర్యలు చేపట్టారు.
- బాధిత కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తారు..? మేయర్ విజయలక్ష్మీ వంటి వారు ఎంత పరిహారం ఇస్తారు..?
తన ఐదు ప్రశ్నల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నెటిజన్లను కూడా కోరారు ఆర్జీవీ. నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మాదిరిగా మిగతా వారి ప్రాణాలు పోకముందే మేల్కొనాలని కోరారు.
ఇదే విషయంపై ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మీని ఆర్టీవీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేల కుక్కలని మేయర్ ఇంట్లో వదిలేయాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు. మేయర్ విజయలక్ష్మీని ఎవరు నియమించారో కూడా తనకు తెలియదంటూ కామెంట్స్ చేశారు. కానీ ఒక మేయర్ ఇంట్లోకి కుక్కల్ని వదిలి బయట నుంచి తాళం వేస్తే ఆ మేయర్ కుక్కల మధ్యలో కూర్చొని కుక్కల్ని ఎంత ప్రేమ చూపిస్తుందో ఏ ఏ కుక్కల్ని ప్రేమగా అన్నం తినిపిస్తుందో చూడాలని ఉందంటూ మేయర్ ను కార్నర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్లు కూడా తెగ వైరల్ అయ్యాయి.