Ramcharan-Allu Arjun: చరణ్ బర్త్‌డే వేడుకల్లో కనిపించని బన్నీ- సోషల్‌మీడియాలో విష్ చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్
28 March 2023, 9:27 IST
Ramcharan - Allu Arjun: రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలకు అల్లు అర్జున్ దూరంగా ఉండటం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ట్వీట్, పోస్ట్‌లు చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతోన్నారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్
Ramcharan - Allu Arjun: మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు (Allu Arjun) మధ్య విభేదాలు ఉన్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీ దూరంగా పెడుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా సోమవారం జరిగిన రామ్‌చరణ్ (Ram Charan) బర్త్‌డే వేడుకలకు అల్లు అర్జున్ హాజరుకాకపోవడంతో ఈ పుకార్లకు బలాన్ని చేకూర్చుతోంది. అంతే కాకుండా రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ట్వీట్, పోస్ట్ చేయకపోవడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో జరుగుతోందని కామెంట్స్ చేస్తోన్నారు.
బన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాడా?
సోమవారం రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు శుభాకాంక్షలు అందజేశారు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం రామ్‌చరణ్‌కు విషెస్ చెప్పారు. అల్లు శిరీష్ కూడా రామ్‌చరణ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు అందజేశారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో అల్లు అర్జున్ సెల్ఫీష్ స్టార్ అంటూ మెగా ఫ్యాన్స్ అతడిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు. అంతే కాకుండా సినీ ప్రముఖుల కోసం చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సోమవారం తమ ఇంట్లో స్పెషల్ బర్త్‌డే పార్టీని ఏర్పాటుచేశారు. ఈ పార్టీకి రాజమౌళి, వెంకటేష్, రానా, విజయ్ దేవరకొండ సహా టాలీవుడ్ హీరోలు చాలా మంది హాజరయ్యారు.
కానీ ఈ వేడుకల్లో బన్నీ మాత్రం కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. అతడు ఈ పార్టీకి హాజరుకాలేదని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతోన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే ఉండి అతడు ఈ పార్టీకీ హాజరుకాలేదని అంటున్నారు. కావాలనే రామ్‌చరణ్ బర్త్ డే పార్టీకి బన్నీ దూరంగా ఉన్నట్లు చెబుతోన్నారు.
నాగబాబు కామెంట్స్ వైరల్...
ఆదివారం అభిమానుల సమక్షంలో రామ్‌చరణ్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నాగబాబు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ వేడుకల్లో మెగా హీరోలందరి గురించి ప్రస్తావించిన నాగబాబు అల్లు అర్జున్ పేరు మాత్రం చెప్పకపోవడం విభేదాల పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది.
మెగా హీరోల నుంచి బన్నీని వేరు చేసినట్లుగా నాగబాబు కామెంట్స్ చూస్తే అర్థమవుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. చరణ్ బర్త్‌డే వేడుకలకు అల్లు అర్జున్ దూరంగా ఉండటం, ట్వీట్ చేయకపోవడం చూస్తుంటే అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టింది నిజమేనని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ మధ్య విభేదాలు గట్టిగానే ఉన్నట్లు చెబుతోన్నారు.