తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan About Oscar: తారక్ నీతో మళ్లీ డ్యాన్స్ చేయాలనుంది.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

Ram Charan About Oscar: తారక్ నీతో మళ్లీ డ్యాన్స్ చేయాలనుంది.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

08 January 2024, 19:46 IST

google News
    • Ram Charan About Oscar: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టును షేర్ చేశారు. ఈ సినిమాలో భాగం చేసినందుకు రాజమౌళికి ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో మరోసారి డ్యాన్స్ చేయాలని ఉన్నట్లు పేర్కొన్నారు.
భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ వేడుకకు హాజరైన రామ్ చరణ్
భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ వేడుకకు హాజరైన రామ్ చరణ్ (Jordan Strauss/Invision/AP)

భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ వేడుకకు హాజరైన రామ్ చరణ్

Ram Charan About Oscar: ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వరించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డు రావడంతో భారత్ నుంచే కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమాకు అవార్డు రావడంతో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. ఈ సినమా తన జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైందని స్పష్టం చేశారు.

"మేము భారతీయ సినిమాగా గెలిచాం. ఓ దేశంగా అవార్డును సొంతం చేసుకున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారత చలన చిత్ర చరిత్రంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎంతో ప్రత్యేక స్థానముంది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. నేనింకా కలలోనే ఉన్నానా అనే భావన కలుగుతోంది. రాజమౌళి, కీరవాణి ఇద్దరూ భారత చిత్రసీమలో అత్యంత విలువైన రత్నాలు. ఆర్ఆర్ఆర్ లాంటి మాస్టర్ పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ ధన్యవాదాలు చెబుతున్నాను." అని రాజమౌళి తన ప్రకటనలో పేర్కొన్నారు.

తన కో స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మరోసారి డ్యాన్స్ చేయాలని ఉన్నట్లు పేర్కొన్నారు. "ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు అనేది ఓ ఎమోషన్‌లా మారింది. ఈ ఎమోషన్‌కు రూపమిచ్చిన గేయ రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లీ గంజ్, కాల భైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. నా బ్రదర్ ఎన్టీఆర్, కో-స్టార్ ఆలియా భట్‌కు కృతజ్ఞతలు. తారక్ నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేయాలని ఆశిస్తున్నా. ఇండియన్ యాక్టర్లందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు" అని రామ్ చరణ్ తెలిపారు.

. ఈ సారి భారత్‌కు రెండు ఆస్కార్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు రాగా.. ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు పురస్కారం వచ్చింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును ఎంఎం కీరవాణీ, చంద్రబోస్ అందుకున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం