Ram Charan in USA: ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్లిన రామ్‌చరణ్.. మెగా పవర్ స్టార్‌కు మరో అరుదైన గౌరవం
21 February 2023, 15:25 IST
- Ram Charan in USA: ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్లాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఆ ప్రతిష్టాత్మ అవార్డుల సెర్మనీకి ఇంకా 20 రోజుల సమయం ఉన్నా.. చెర్రీ ఇంత ముందుగా వెళ్లడానికి మరో కారణం ఉంది.
అమెరికా ఫ్లైటెక్కే ముందు ఎయిర్ పోర్టులో రామ్ చరణ్
Ram Charan in USA: ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా రిలీజై ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ ఈ మూవీ టూర్లలోనే అతడు బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే చాలాసార్లు ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్లి వచ్చిన చెర్రీ.. తాజాగా మరోసారి యూఎస్ ఫ్లైటెక్కాడు.
ఈసారి ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కోసం అతడు వెళ్లాడు. ఈ అవార్డు కోసం ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే మార్చి 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం సుమారు 20 రోజుల ముందుగానే చరణ్ ఎందుకు అమెరికా వెళ్లాడన్న సందేహం చాలా మందికి కలిగింది. దీనికి మరో కారణం ఉంది. మరో అరుదైన గౌరవం అందుకోవడానికి చెర్రీ అక్కడికి వెళ్లాడు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆరో వార్షిక ఫిల్మ్ అవార్డుల సెర్మనీలో పాల్గొనేందుకు చెర్రీ వెళ్లడం విశేషం. ఈ ఈవెంట్ వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 24) జరగనుంది. ఈ అవార్డుల సెర్మనీలో ప్రజెంటర్ గా రామ్ చరణ్ కు అరుదైన అవకాశం దక్కింది. ఈ అవార్డుల సెర్మనీలో చెర్రీతోపాటు బ్రాండన్ పెరియా, డేవిడ్ డాస్ట్మల్‌చెయిన్, మాడెలిన్ క్లైన్, ట్రినిటి జో-లి బ్లిస్, వయొలెట్ మెక్‌గ్రా కూడా ప్రజెంటర్లుగా ఉన్నారు.
ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల రేసులోనూ ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయింది. అటు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు గెలుచుకున్న నాటు నాటు సాంగ్ ఇక ఆస్కార్స్ పై కన్నేసింది.