తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్‌చరణ్‌ ఇంట్లో ఆమిర్‌ ఖాన్‌ డిన్నర్‌.. ఫొటో వైరల్‌

Ram Charan: రామ్‌చరణ్‌ ఇంట్లో ఆమిర్‌ ఖాన్‌ డిన్నర్‌.. ఫొటో వైరల్‌

HT Telugu Desk HT Telugu

28 June 2022, 21:31 IST

google News
    • బాలీవుడ్‌ సెలబ్రిటీలకు మంచి హోస్ట్‌గా మారిపోయాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఈ మధ్యే సల్మాన్‌ఖాన్‌కు ఆతిథ్యమిచ్చిన అతడు.. తాజాగా మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌నూ డిన్నర్‌కు ఆహ్వానించాడు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులతో ఆమిర్ ఖాన్
రామ్ చరణ్, ఉపాసన దంపతులతో ఆమిర్ ఖాన్ (Instagram )

రామ్ చరణ్, ఉపాసన దంపతులతో ఆమిర్ ఖాన్

ట్రిపుల్‌ ఆర్‌ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు రామ్‌చరణ్‌. అలాగే బాలీవుడ్‌ స్టార్లు కూడా అతనికి మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. ఈ మధ్యే తన లేటెస్ట్ మూవీ కభీ ఈద్‌ కభీ దివాళీ షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చిన సల్మాన్‌ఖాన్‌.. చెర్రీ ఇంట్లో డిన్నర్‌ చేసిన విషయం తెలిసిందే. అతనితోపాటు వెంకటేశ్‌, పూజా హెగ్డే కూడా రామ్‌చరణ్‌ ఇంటికి వెళ్లారు. వీళ్లకు చరణ్‌, ఉపాసన దంపతులు మంచి ఆతిథ్యమిచ్చారు. ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ఇక ఇప్పుడు మరో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌గా పేరుగాంచిన ఆమిర్‌ ఖాన్‌ కూడా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న చరణ్‌ ఇంటికి వచ్చాడు. కొన్ని రోజుల టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ను తన ఇంటికి ఇన్వైట్‌ చేశాడు రామ్‌చరణ్‌. ఈ ఫొటోను చెర్రీ పెట్‌ డాగ్‌ రైమ్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు.

ఇంతకుముందు సల్మాన్‌ఖాన్‌, వెంకటేశ్‌, పూజా హెగ్డేలతో చెర్రీ కపుల్‌ దిగిన ఫొటోను ఇదే అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అటు ఉపాసన కూడా తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ ఇద్దరు స్టార్లు తమ ఇంటికి వచ్చినప్పటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రిపుల్‌ ఆర్‌ మూవీ రిలీజ్‌కు ముందు హిందీ బెల్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ఈ సినిమాను ప్రమోట్‌ చేశాడు. అప్పట్లో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతో కలిసి నాటునాటు స్టెప్పులు కూడా వేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీ15గా పిలుస్తున్న ఈ మూవీకి అధికారి అనే టైటిల్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో కియారా అద్వానీ నటిస్తోంది. మరోవైపు ఆమిర్‌ఖాన్‌ తన నెక్ట్స్‌ మూవీ లాల్‌ సింగ్‌ చద్దా మూవీ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

తదుపరి వ్యాసం