తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Record: రామ్ చరణ్ కొత్త రికార్డు.. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో షారుక్ ఖాన్ రికార్డు బ్రేక్

Ram Charan record: రామ్ చరణ్ కొత్త రికార్డు.. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో షారుక్ ఖాన్ రికార్డు బ్రేక్

Hari Prasad S HT Telugu

26 October 2023, 17:27 IST

google News
    • Ram Charan record: రామ్ చరణ్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో షారుక్ ఖాన్ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమాలోని జరగండి పాట కోసం చేసిన ఖర్చు ఓ రేంజ్ లో ఉండటం విశేషం.
గేమ్ ఛేంజర్ సాంగ్ జరగండిలో రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ సాంగ్ జరగండిలో రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ సాంగ్ జరగండిలో రామ్ చరణ్

Ram Charan record: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తన ప్రతి సినిమానూ ఓ రేంజ్ లో తీసే అలవాటున్న శంకర్.. ఈ మూవీలోనూ జరగండి అనే ఓ సాంగ్ కోసం భారీగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడిదే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా ఈ జరగండి నిలవడం విశేషం.

గేమ్ ఛేంజర్ మూవీలోని ఈ జరగండి పాట కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఇంత భారీ బడ్జెట్ తో మూడు, నాలుగు చిన్న సినిమాలనే తీసేయొచ్చు. ఈ పాటతో రామ్ చరణ్ ఇప్పుడు షారుక్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు. నిజానికి ఈ సినిమాలోని అన్ని పాటలపై శంకర్ భారీగా ఖర్చు చేశాడు. అయితే ఈ పాట కోసం చేసిన ఖర్చు వివరాలు మాత్రం బయటకు వచ్చాయి.

ఈ మధ్యే గేమ్ ఛేంజర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న తమన్ ఈ జరగండి సాంగ్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది. అయితే ఏకంగా ఒక్క పాట కోసమే రూ.20 కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం మామూలు విషయం కాదు. ఈ భారీ ఖర్చుతో జరగండి ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా నిలిచింది.

ఈ మధ్యే రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన జవాన్ మూవీలో జిందా బందా అనే సాంగ్ కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారు. ఈ పాటను రూ.15 కోట్లతో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ లెక్కన షారుక్ ఖాన్ రికార్డును ఇప్పుడు రామ్ చరణ్ బ్రేక్ చేసినట్లయింది. నిజానికి శంకర్ డైరెక్షన్ లోనే వచ్చిన 2.0 మూవీలో యంత్ర లోకపు సుందరివే సాంగ్ ను కూడా రూ.20 కోట్లతో చిత్రీకరించినట్లు సమాచారం.

మరోవైపు గేమ్ ఛేంజర్ మూవీ చాలా ఆలస్యమవుతూ వస్తోంది. శంకర్ ఓవైపు ఇండియన్ 2 చేస్తూనే ఈ గేమ్ ఛేంజర్ కూడా చేస్తుండటంతో షూటింగ్ తరచూ వాయిదా పడుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం