తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajkumar Rao: హీరో పాత్రలకు పనికి రావన్నారు.. నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Rajkumar Rao: హీరో పాత్రలకు పనికి రావన్నారు.. నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu

05 November 2022, 8:05 IST

google News
    • బాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న కష్టాలను హీరో రాజ్‌కుమార్ రావు మరోసారి ప్రస్తావించారు.
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు

నటుడు రాజ్‌కుమార్ రావు తాను తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఓ ఈవెంట్‌లో ఆ విషయమై మాట్లాడుతూ తన రూపం కారణంగా తిరస్కరణకు గురయ్యానని చెప్పుకొచ్చారు.

తానేమీ అందంగా లేకపోవచ్చునని, అయితే దర్శకుడు దివాకర్ బెనర్జీ తనలోని టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారని వివరించారు.

రాజ్‌కుమార్ రావు రణ్ మూవీలో న్యూస్ రీడర్ పాత్రతో ఆరంగేట్రం చేశారు. నిర్మాత దివాకర్ బెనర్జీ చిత్రాలు హిట్, లవ్, సెక్స్, ధోకా వంటివి ఆయనకు బాలీవుడ్‌లో మంచి కెరీర్‌కు బాటలు వేశాయి. న్యూటన్ వంటి చిత్రాలు పేరు తెచ్చాయి.

రాజ్‌కుమార్ రావ్ తదుపరి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మోనికా.. ఓ మై డార్లింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 11న విడుదల కాబోతోంది.

ఈ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘నేను కథానాయకుడి పాత్రకు ఆడిషన్ ఛాన్స్ కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నా. హీరో స్నేహితుడి రోల్ కోసం ఆడిషన్ చేయమని అడిగేవారు. నాకు తెలుసు నేను పెద్ద అందగాడిని ఏం కాదని. కానీ దివాకర్ బెనర్జీ నాలో టాలెంట్ చూశారు..’ అని చెప్పారు.

తన రూపానికి సంబంధించిన విషయాల్లో తిరస్కరణకు గురైన విషయాన్ని రాజ్‌కుమార్ గతంలో కూడా షేర్ చేసుకున్నారు. పాత్రకు తగినంత పొడవు లేదని కొందరు, బాడీ షేప్ సరిపోదని కొందరు తిరస్కరించినట్టు చెప్పారు. తన కనుబొమ్మల ఆకృతి కూడా బాగోలేదని తిరస్కరించినట్టు చెప్పారు.

రాజ్‌కుమార్ రావ్ ఇటీవల హిట్: ది ఫస్ట్ కేస్ మూవీలో నటించారు. ఇందులో సాన్యా మల్హోత్రా కథానాయిక. నిర్మాత వసంత్ బాలా దర్శకత్వంలో వస్తున్న డార్క్ కామెడీ మూవీ మోనికా.. ఓ మై డార్లింగ్ విడుదలపై ఆసక్తిగా ఉన్నారు. ఇందులో హ్యూమా ఖురేషి, రాధికా ఆప్టే తదితర పాపులర్ నటులు ఈ మూవీలో నటించారు. సంజయ్ రౌత్రే, సరితా పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ, ప్రేమ వైఫల్యం, బ్లాక్ మెయిల్, మర్డర్ మిస్టరీ ఈ చిత్ర కథాంశాలు.

ఈ చిత్రం గురించి వాసన్ బాలా ఇటీవల వివరిస్తూ ‘మోనికా.. ఓ మై డార్లింగ్ డార్క్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో హాస్యంతో కలగలిపిన క్రైమ్ మిస్టరీ ప్రేక్షకులను అలరిస్తుంది..’ అని చెప్పారు.

తదుపరి వ్యాసం