తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Soundarya Rajinikanth: తాతగా మారిన రజనీకాంత్ - మగబిడ్డకు జన్మనిచ్చిన కుమార్తె సౌందర్య

Soundarya Rajinikanth: తాతగా మారిన రజనీకాంత్ - మగబిడ్డకు జన్మనిచ్చిన కుమార్తె సౌందర్య

12 September 2022, 7:46 IST

google News
  • Soundarya Rajinikanth: రజనీకాంత్ కుమార్తె సౌందర్య తల్లయింది. ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

సౌందర్య రజనీకాంత్, విషాగన్
సౌందర్య రజనీకాంత్, విషాగన్ (twitter)

సౌందర్య రజనీకాంత్, విషాగన్

Soundarya Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తాతగా మారారు. ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాను తల్లిగా మారిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సౌందర్య వెల్లడించింది. ‘తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుడి దయతో వేద్ లిటిల్ బ్రదర్ కు నేను, విషాగన్, వేద్ కలిసి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వైద్య బృందానికికృతజ్ఞతలు తెలిపింది.

అంతేకాకుండా తన కుమారుడికి వీర్ రజనీకాంత్ వనంగమూడి అంటూ పేరు పెట్టింది. వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ ను 2010లో పెళ్లాడింది సౌందర్య. మనస్పర్థలతో 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి వేద్ కృష్ణ అనే కుమారుడు జన్మించాడు.

2019లో విషాగన్ వనంగమూడిని సౌందర్య రెండో పెళ్లి చేసుకున్నారు. విషాగన్ కు ఇది రెండో పెళ్లి. కనికా కుమారన్ నుంచి విడిపోయిన తర్వాత సౌందర్యను పెళ్లాడారు. తండ్రి రజనీకాంత్ నటించిన పలు సినిమాలకు సౌందర్య రజనీకాంత్ గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసింది. కొచ్చాడయన్, వేలై ఇళ్ల పట్టాధరి 2 సినిమాలకు దర్శకత్వం వహించింది.

తదుపరి వ్యాసం