Raghuvaran B.Tech Re-release: ‘రఘువరన్ బీటెక్’ రీ-రిలీజ్ క్రేజ్: మార్మోగుతున్న థియేటర్లు: వీడియోలు
18 August 2023, 15:08 IST
- Raghuvaran B Tech Re-release: రఘువరన్ బీటెక్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో నేడు రీ-రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రానికి అంచనాలకు మించి స్పందన వస్తోంది. థియేటర్ల వద్ద యూత్ సందడి విపరీతంగా ఉంది.
Raghuvaran B.Tech Re-release: ‘రఘువరన్ బీటెక్’ రీ-రిలీజ్ క్రేజ్: మార్మోగుతున్న థియేటర్లు
Raghuvaran B Tech Re-release: 2015లో విడుదలైన ‘రఘువరన్ బి.టెక్’ చిత్రం సూపర్ హిట్ అయింది. తమిళంలో వెలైలా పట్టాధారి పేరుతో రూపొంది తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో రిలీజ్ అయింది. తమిళ స్టార్ ధనుశ్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులోనూ బ్లాక్‍బాస్టర్ అయింది. నిరుద్యోగి కష్టాలు, మధ్య తరగతి కుటుంబంలోని అనుబంధాలు, హీరో ఎదిగే తీరు సహా ‘రఘువరన్ బి.టెక్’ చిత్రంలోని అన్ని అంశాలు పండటంతో యూత్‍కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్‍గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. నేడు (ఆగస్టు 18) ‘రఘువరన్ బి.టెక్’ మరోసారి థియేటర్లలోకి వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో నేడు ‘రఘువరన్ బి.టెక్’ రీ-రిలీజ్ అయింది. ఈ సినిమాకు రీ-రిలీజ్‍లోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టికెట్లు కూడా భారీగా బుక్ అయ్యాయి. ‘రఘువరన్ బి.టెక్’ అయిన థియేటర్లలో హంగామా కూడా ఫుల్‍గా కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ సందడి మామూలుగా లేదు. థియేటర్లో ఓ పాటకు ప్రేక్షకులు కేకలతో మోత మోగించారు. పాట పాడుతూ హోరెత్తించారు. దీంతో థియేటర్ మార్మోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
‘రఘువరన్ బి.టెక్’ చిత్రంలో ధనుష్ డైలాగ్స్ వచ్చిన సమయంలో విజిల్స్, అరుపులు మోత మోగుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం రీ-రిలీజ్‍కు కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
రఘువరన్ బి.టెక్ చిత్రాన్ని 2015లో తెలుగులో రిలీజ్ చేసింది స్రవంతి మూవీస్ బ్యానర్. అప్పుడు ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రానికి వేల్‍రాజ్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ కోసం డైరెక్టర్ కిశోర్ తిరుమల డైలాగ్స్ రాశారు. అమలాపాల్ ఈ చిత్రంలో ధనుశ్‍కు జోడీగా నటించారు. వివేక్, సముద్రఖి,శరణ్య, హరికేశ్ కీలకపాత్రలు పోషించారు. మొత్తంగా ఈ చిత్రం యూత్‍కు కనెక్ట్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.