తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raghu Kunche Busy As Actor: విల‌న్ క్యారెక్ట‌ర్స్‌తో న‌టుడిగా బిజీ అవుతున్న‌ ర‌ఘు కుంచె

Raghu Kunche Busy As Actor: విల‌న్ క్యారెక్ట‌ర్స్‌తో న‌టుడిగా బిజీ అవుతున్న‌ ర‌ఘు కుంచె

30 October 2022, 19:40 IST

google News
  • Raghu Kunche Busy As Actor: ప‌లాస సినిమాతో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చాడు సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె. ప్ర‌స్తుతం విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఐదు సినిమాల్లో న‌టిస్తున్నాడు.

ర‌ఘు కుంచె
ర‌ఘు కుంచె

ర‌ఘు కుంచె

Raghu Kunche Busy As Actor: న‌టులుగా స‌క్సెస్ అయిన సంగీత ద‌ర్శ‌కులు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా అరుదుగా క‌నిపిస్తారు. అందులో ర‌ఘు కుంచె ఒక‌రు. బాచి, బంప‌ర్ఆఫ‌ర్‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మెప్పించారు ర‌ఘు కుంచె. 2020లో విడుద‌లైన ప‌లాస 1978 సినిమాతో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో శ్రీకాకుళం యాస‌లో కొత్త పంథాలో విల‌నిజాన్ని పండించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

ప‌లాస సినిమాలో న‌టిస్తూనే ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. నాది న‌క్కిలీసు గొలుసు పాట‌తో సంగీతాభిమానుల్ని అల‌రించాడు. ప‌లాస సినిమాతో న‌టుడిగా ర‌ఘు కుంచె బిజీగా మారాడు. ప్ర‌స్తుతం విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఐదు సినిమాల్లో న‌టిస్తున్నాడు ర‌ఘు కుంచె. ఇందులో ఓ మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌ఘు కుంచె తెలిపాడు. ఇటీవ‌ల విడుద‌లైన రుద్ర‌వీణ‌లో మెయిన్ విల‌న్ పాత్ర‌లో ర‌ఘు కుంచె క‌నిపించాడు. ప్ర‌స్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో రూపొందుతోన్న చిన్న సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడు.

మెయిన్‌లీడ్‌గా ఓ సినిమా...

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, విల‌న్‌గానే కాకుండా మెయిన్‌లీడ్‌లో ర‌ఘు కుంచె ఓ సినిమా చేయ‌బోతున్నాడు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు తెలిసింది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ర‌ఘు కుంచె క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఓ వైపు న‌ట‌న‌పై దృష్టిసారిస్తూనే సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటున్నారు. ప్ర‌స్తుతం మూడు తెలుగు సినిమాల‌కు సంగీతాన్ని అందిస్తోన్న‌ట్లు ర‌ఘు కుంచె పేర్కొన్నాడు.

తదుపరి వ్యాసం