తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Radhaku Neevera Pranam Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ రాధకు నీవేరా ప్రాణం.. ఎప్పటి నుంచి అంటే?

Radhaku Neevera Pranam Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ రాధకు నీవేరా ప్రాణం.. ఎప్పటి నుంచి అంటే?

Hari Prasad S HT Telugu

20 March 2023, 16:53 IST

  • Radhaku Neevera Pranam Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ రాధకు నీవేరా ప్రాణం రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా ఆ ఛానెల్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

జీ తెలుగులో రానున్న రాధకు నీవేరా ప్రాణం
జీ తెలుగులో రానున్న రాధకు నీవేరా ప్రాణం

జీ తెలుగులో రానున్న రాధకు నీవేరా ప్రాణం

Radhaku Neevera Pranam Serial: తెలుగులో ఎన్నో టాప్ సీరియల్స్ తో దూసుకెళ్తున్న జీ తెలుగు ఛానెల్ మరో సరికొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్ పేరు రాధకు నీవేరా ప్రాణం. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఆమె గుండె చప్పుడు అతను.. ఆ గుండె వెనుక గతం అతని జీవితం అనే క్యాప్షన్ తో ఈ సీరియల్ ప్రోమోను పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Chiranjeevi: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. నేను పిఠాపురం వెళ్లడం లేదు: చిరంజీవి కామెంట్స్ వైరల్

Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే

Best Crime Thriller Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

Chiranjeevi Pawan Kalyan: చిరంజీవికి బాగా నచ్చిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు ఇవే.. అవేంటో గెస్ చేశారా?

నిరుపమ్ పరిటాల, గోమతి ప్రియ ఈ సీరియల్ లో లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ సీరియల్ ఎప్పటి నుంచి టెలికాస్ట్ కాబోతోందో మాత్రం ఆ ఛానెల్ వెల్లడించలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మాత్రం చెప్పింది. హృదయాన్ని హత్తుకునే సరికొత్త ప్రేమకథ అంటూ ఈ సీరియల్ ప్రోమోను జీ తెలుగు ఛానెల్ తీసుకొచ్చింది.

ఈ ప్రోమోలో భాగంగా మొదట ఇందులో నటించే లీడ్ రోల్స్ ను పరిచయం చేసింది. హీరో నిరుపమ్ రోడ్డు పక్కన చాయ్ తాగుతూ కనిపించగా.. హీరోయిన్ గోమతి పెయింటింగ్ వేస్తూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటుంది. హీరోని చూడగానే ఆమె గుండె వేగం పెరుగుతుంది. మరోవైపు రోడ్డుపై అమ్మాయిలను ఏడిపిస్తున్న ఆకతాయిలకు బుద్ధి చెబుతూ కనిపిస్తాడు మన హీరో.

బ్యాక్‌గ్రౌండ్ లో నిన్నే కోరె నే నిన్నే కోరె అనే పాట వస్తూ ఉంటుంది. ఆకతాయిలను లోపలేసి స్టైల్ గా పోలీసు డ్రెస్సులో బైక్ పై వస్తుంటాడు హీరో. అప్పటికే అతనిపై మనసు పారేసుకున్న ఆమె.. అతని బొమ్మను రోడ్డుపై గీస్తుంది. అది చూసి అతడు ఆశ్చర్యపోతాడు. ఈ లోపు బ్యాక్ గ్రౌండ్ లో "ఆమె గుండె చప్పుడు అతను.. ఆ గుండె వెనుక గతం అతని జీవితం" అనే వాయిస్ వినిపిస్తుంది.

ఇంతకీ వీళ్ల లవ్ స్టోరీ ఏంటి? ఆ గుండె వెనుక ఉన్న ఆ గతమేంటి అన్నది రాధకు నీవేరా ప్రాణం సీరియల్ చూస్తే తెలుస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే ఈ డైలీ సీరియల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది త్వరలోనే జీ తెలుగు ఛానెల్ అనౌన్స్ చేయనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం