Pushpa in Russia: రష్యాలో రిలీజ్‌కు సిద్ధమైన పుష్ప: ది రైజ్.. ఎప్పుడంటే?
28 November 2022, 19:17 IST
- Pushpa in Russia: రష్యాలో రిలీజ్‌కు సిద్ధమైంది పుష్ప: ది రైజ్ మూవీ. ఓవైపు ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ జరుగుతుండగా.. మొదటి పార్ట్ అక్కడ రష్యాలో అక్కడి భాషలో రిలీజ్ కాబోతోతుండటం నిజంగా విశేషమే.
రష్యాలో విడుదలకు సిద్ధమైన పుష్ప
Pushpa in Russia: పుష్ప: ది రైజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం ఓ సంచలనం సృష్టించింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీగా పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపించిన అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. తెలుగుతో సమానంగా హిందీలోనూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడీ సినిమా ఇండియా దాటి రష్యాలో అడుగు పెట్టబోతోంది. డిసెంబర్ 1 నుంచి ఆ దేశంలో ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఇక డిసెంబర్ 8న రష్యా వ్యాప్తంగా పుష్ప రిలీజ్ అవనుంది. ఈ మూవీలోని తగ్గేదేలే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా. ఆ డైలాగ్‌లాగే పుష్ప మూవీ కూడా అసలు తగ్గడం లేదు. ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు అవార్డుల పంట పండించింది.
ఇప్పుడిక రష్యాలో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్‌లో మన దగ్గర ఈ సినిమా రిలీజై సంచలనం సృష్టించగా.. ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత రష్యాలో అడుగుపెట్టబోతోంది. డిసెంబర్ 1న రష్యా రాజధాని మాస్కోలో ప్రీమియర్స్ ఉండనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ పీటర్స్‌బర్గ్‌లోనూ మరో ప్రీమియర్ షో ఉంటుంది.
వీటికి పుష్ప సినిమా నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరు కానుండటం విశేషం. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న అక్కడ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ తన గత సినిమాలతోనే కేరళతోపాటు నార్త్‌లోనూ ఎంతో క్రేజ్ సంపాదించాడు. ఇక పుష్ప మూవీతో అతని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పుష్ప 2 కోసం అతడు ఏకంగా రూ.125 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.