తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa 2 Update Sai Pallavi Joins Allu Arjun Pushpa The Rule Sets

Sai Pallavi Joins Pushpa - 2: పుష్ప సీక్వెల్‌పై మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - సెట్స్‌లో అడుగుపెట్టిన‌ సాయిప‌ల్ల‌వి

08 March 2023, 10:30 IST

  • Sai Pallavi Joins Pushpa - 2: పుష్ప సీక్వెల్ షూటింగ్‌లో మంగ‌ళ‌వారం నుంచి సాయిప‌ల్ల‌వి జాయిన్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ సీక్వెల్‌లో సాయిప‌ల్ల‌వి అతిథి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సాయిప‌ల్ల‌వి
సాయిప‌ల్ల‌వి

సాయిప‌ల్ల‌వి

Sai Pallavi Joins Pushpa - 2: పుష్ప సీక్వెల్‌లో సాయిప‌ల్ల‌వి భాగం కాబోతున్న‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రేజీ సీక్వెల్‌లో సాయిప‌ల్ల‌వి న‌టించ‌నుండ‌టంపై చిత్ర యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం సాయిప‌ల్ల‌వి పుష్ప‌-2లో న‌టించ‌నున్న‌ది నిజ‌మేనంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో ఆమె ఈ సినిమాలో మెర‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంగ‌ళ‌వారం సాయిప‌ల్ల‌వి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్లు చెబుతున్నారు. పుష్ప -2 సినిమాలో సాయిప‌ల్ల‌వి గిరిజ‌న యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం ఆమె ప‌ది రోజుల పాటు డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతోన్నారు.

సాయిప‌ల్ల‌వి పుష్ప‌-2 సెట్స్‌లో అడుగుపెట్టింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అల్లు అర్జున్‌, సాయిప‌ల్ల‌వి కాంబో అదిరిపోతుందని కామెంట్స్ చేస్తోన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, సాయిపల్లవిలపై హైదరాబాద్‌లో ద‌ర్శ‌కుడు సుకుమార్ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తోన్న‌ట్లు చెబుతోన్నారు. 2021లో రిలీజైన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ది రూల్ తెర‌కెక్కుతోంది. పుష్ప పార్ట్ వ‌న్ ఘ‌న విజ‌యం నేప‌థ్యంలో ఈ సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. పుష్ప ది రూల్ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. గ‌త ఏడాది రిలీజైన విరాట ప‌ర్వం త‌ర్వాత తెలుగు సినిమాల‌కు బ్రేక్ తీసుకున్న‌దిసాయిప‌ల్ల‌వి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.