Allu Arha Shakuntalam Movie: శాకుంత‌లం సినిమాకు అల్లు అర్హ సొంత డ‌బ్బింగ్ - ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్‌-allu arha own dubbing for shaakuntalam movie shakuntalam update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arha Own Dubbing For Shaakuntalam Movie Shakuntalam Update

Allu Arha Shakuntalam Movie: శాకుంత‌లం సినిమాకు అల్లు అర్హ సొంత డ‌బ్బింగ్ - ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 19, 2023 07:51 AM IST

Allu Arha Shakuntalam Movie: అల్లు అర్జున్ ముద్దుల త‌న‌య అల్లు అర్హ‌ శాకుంత‌లంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్హ సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది. అల్లు అర్హ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతోన్న ఫొటోను అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

అల్లు అర్హ
అల్లు అర్హ

Allu Arha Shakuntalam Movie: అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ శాకుంత‌లం సినిమాతో బాల‌న‌టిగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ క‌నిపించ‌బోతున్న‌ది. ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌లో సింహాంపై స్వారీ చేస్తూ అల్లు అర్హ క‌నిపించింది. ఈ సీన్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

కాగా త‌న పాత్ర కోసం అల్లు అర్హ సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటూ తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా నిరూపించుకున్న‌ది. శాకుంత‌లం సినిమాకు అల్లు అర్హ డ‌బ్బింగ్ చెబుతోన్న ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు హార్ట్ ఎమోజీని జోడించాడు. అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

శాకుంత‌లం సినిమాలో టైటిల్ పాత్ర‌లో స‌మంత క‌నిపిస్తోంది. మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. బుధ‌వారం శాకుంత‌లం ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మ‌ల్లికా మ‌ల్లికా అంటూ సాగే ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాలో దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ క‌నిపించ‌బోతున్నారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్