తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Producer On Prabhas Sukumar Movie: ప్రభాస్‌, సుకుమార్‌ మూవీపై ప్రొడ్యూసర్‌ రియాక్షన్‌ ఇదీ

Producer on Prabhas Sukumar Movie: ప్రభాస్‌, సుకుమార్‌ మూవీపై ప్రొడ్యూసర్‌ రియాక్షన్‌ ఇదీ

Hari Prasad S HT Telugu

27 December 2022, 15:24 IST

google News
    • Producer on Prabhas Sukumar Movie: ప్రభాస్‌, సుకుమార్‌ మూవీపై ప్రొడ్యూసర్‌ అభిషేక్‌ అగర్వాల్‌ స్పందించాడు. అయితే ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అతడు ఓ బ్యాడ్‌న్యూస్‌ చెప్పాడు.
ప్రభాస్, సుకుమార్ సినిమాపై బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్
ప్రభాస్, సుకుమార్ సినిమాపై బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్

ప్రభాస్, సుకుమార్ సినిమాపై బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్

Producer on Prabhas Sukumar Movie: ఒకరు టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగి చాన్నాళ్లే అవుతోంది. మరొకరు గతేడాదే పుష్ప మూవీతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని ఒక రోజు ముందు జోరుగా వార్తలు వచ్చాయి.

ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను చాలా ఆనందంలో ముంచెత్తింది. అయితే ఓవైపు ప్రభాస్‌ చేతిలో ఇప్పటికే చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. సలార్‌, ప్రాజెక్ట్‌ కే, రాజా డీలక్స్‌లాంటి సినిమాలతో మరో రెండేళ్ల పాటు ప్రభాస్‌కు ఊపిరి సలపని షెడ్యూల్‌ ఉంది. మరోవైపు పుష్ప 2తోపాటు ఆ తర్వాత రామ్‌చరణ్‌తోనూ సుకుమార్‌ సినిమా చేయనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్‌, సుకుమార్‌ ప్రాజెక్ట్‌ ఎప్పటికి పట్టాలెక్కాలో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌, సుకుమార్‌ మూవీని నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చిన ప్రొడ్యూసర్‌ అభిషేక్ అగర్వాల్ స్పందించాడు. అయితే అతడో బ్యాడ్ న్యూస్‌ చెప్పాడు. ఈ సినిమా కేవలం ఓ పుకారు మాత్రమే అని అతడు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ప్రభాస్‌ అభిమానులు కూడా ప్రభాస్‌, సుకుమార్‌, అభిషేక్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తను షేర్‌ చేస్తున్నారు.

అయితే అలాంటిదేమీ లేదని నేరుగా నిర్మాతే స్పష్టం చేయడంతో ఫ్యాన్స్‌ ఉసూరుమన్నారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే తానే నేరుగా అనౌన్స్‌ చేస్తానని కూడా అభిషేక్‌ అగర్వాల్‌ స్పష్టం చేయడం విశేషం. కార్తికేయ 2, ది కశ్మీర్‌ ఫైల్స్‌లాంటి మూవీస్‌తో అభిషేక్ అగర్వాల్‌ పాపులర్‌ అయ్యారు. రానున్న రోజుల్లో మరింత భారీ బడ్జెట్‌ సినిమాలను తెరకెక్కించడానికి కూడా ఈ ప్రొడ్యూసర్‌ సిద్ధమవుతున్నాడు.

తదుపరి వ్యాసం