తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Trailer: ప్రభాస్ సలార్‌ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఒక్క ఫొటోతో కన్ఫర్మ్

Salaar Trailer: ప్రభాస్ సలార్‌ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఒక్క ఫొటోతో కన్ఫర్మ్

Sanjiv Kumar HT Telugu

19 November 2023, 10:37 IST

google News
  • Prashanth Neel Wife About Salaar Trailer: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లికిత రెడ్డి నీల్. దీంతో లికిత షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.

ప్రభాస్ సలార్‌ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఒక్క ఫొటోతో కన్ఫర్మ్
ప్రభాస్ సలార్‌ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఒక్క ఫొటోతో కన్ఫర్మ్

ప్రభాస్ సలార్‌ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఒక్క ఫొటోతో కన్ఫర్మ్

Likitha Reddy Neel About Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులే కాదు.. బాక్సాఫీస్ కూడా ఎదురుచూస్తుంటుంది. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ఐదారు క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీల్లో ఒకటే సలార్. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. పలు వాయిదాలతో పోస్ట్ పోన్ అవుతున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విడుదల తేదిని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. సలార్ మొదటి పార్టును డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అంటే, క్రిస్మస్ పండుగ సందర్భంగా సలార్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సలార్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇటీవల సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు సలార్ ట్రైలర్‌పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లికిత రెడ్డి నీల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో కేజీఎఫ్ చిత్రాల హీరో, కన్నడ స్టార్ యశ్ కెమియో రోల్ చేసినట్లుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా కేజీఎఫ్ సినిమాల్లో చేసిన రాకీ భాయ్ పాత్రలోనే సలార్‌లో యశ్ కనిపిస్తాడని టాక్.

ప్రశాంత్ నీల్ భార్య లికిత రెడ్డి తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో సలార్ ట్రైలర్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అని రాసుకొస్తూ ఓ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో రవి బస్రూర్ మ్యూజిక్ అండ్ మూవీస్ స్టూడియో నుంచి తీసింది. అందులో "సలార్ సీజ్‌ఫైర్ ట్రైలర్ కట్ ప్రాసెస్‌లో ఉంది" అని లికిత రెడ్డి రాసుకొచ్చారు. దీంతో ఆ పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఫొటోతో సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని కన్ఫర్మ్ చేశారుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం