Prakash Raj On Kashmir Files: కశ్మీర్ ఫైల్స్‌కు భాస్కర్ అవార్డ్ కూడా రాదు - ప్రకాష్‌రాజ్ కామెంట్స్ వైరల్
09 February 2023, 9:55 IST
Prakash Raj On Kashmir Files: కశ్మీర్‌ఫైల్స్ సినిమాకు భాస్కర్ అవార్డ్ కూడా రాదంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. ఇలాంటి చెత్త సినిమాల నిర్మాణం వెనుక ఎవరున్నారో ప్రజలందరికి తెలుసునని ప్రకాష్ పేర్కొన్నాడు.
ప్రకాష్ రాజ్
Prakash Raj On Kashmir Files: ది కశ్మీర్‌ఫైల్స్ చెత్త సినిమా అని నటుడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు సంగతి పక్కనపెడితే కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదని పేర్కొన్నాడు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రకాష్‌రాజ్ కశ్మీర్‌ఫైల్స్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఎవరూ నిర్మించారు, ఇలాంటి సినిమాల నిర్మాణం వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసునని ప్రకాష్ రాజ్ అన్నాడు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించినందుకు తనకు ఎందుకు అస్కార్ అవార్డ్ రాలేదో అర్థం కాలేదంటూ దర్శకుడు చెప్పిన మాటలను సిగ్గుచేటుగా ఉన్నాయి. ఈ సినిమా చేసినందుకు డైరెక్టర్‌కు ఆస్కార్ అవార్డ్ కాదు కదా కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు.
ఇంటర్‌నేషనల్ జ్యూరీ మెంబర్స్ కూడా పనికిరాని సినిమా అంటూ కశ్మీర్ ఫైల్స్‌పై ఉమ్మివేశారు. ఇలాంటి చెత్త సినిమాల నిర్మాణం వెనుక ఎవరున్నారో, వారి ప్రధాన ఉద్దేశం ఏమిటో ప్రజలందరికి తెలుసు. ఇలాంటి సినిమాలతో ప్రతిసారి ప్రజలను పిచ్చోళ్లను చేయలేరని ప్రకాష్ రాజ్ అన్నాడు.
ప్రకాష్ రాజ్ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. రిలీజ్ సమయంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రకాష్ రాజ్ నెగెటివ్ కామెంట్స్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ఈ సినిమా గత ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
1990లో కశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు జరిపిన దాడులను ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నాయకులు ప్రశంసలు కురిపించారు. ఇఫీతో పాటు పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఇండివిజువల్ కేటగిరీలోచిత్ర యూనిట్ ఆస్కార్‌కు అప్లై చేసిన సినిమాకు మాత్రం ఎంపిక కాలేదు.
టాపిక్