తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhu Deva: 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన ప్రభుదేవా.. రెండో భార్యతో తొలి సంతానం

Prabhu Deva: 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన ప్రభుదేవా.. రెండో భార్యతో తొలి సంతానం

Hari Prasad S HT Telugu

12 June 2023, 16:35 IST

google News
    • Prabhu Deva: 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యాడు ప్రభుదేవా. రెండో భార్యతో తొలి సంతానాన్ని పొందాడు. 2020లో ఈ పెళ్లి చేసుకున్న అతడు.. ఓ పాపకు తండ్రవడం విశేషం.
రెండో భార్య హిమానీతో ప్రభు దేవా
రెండో భార్య హిమానీతో ప్రభు దేవా

రెండో భార్య హిమానీతో ప్రభు దేవా

Prabhu Deva: ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభు దేవా 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యాడు. మూడేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆ భార్య ద్వారా తొలి సంతానాన్ని పొందాడు. ప్రభు దేవా రెండో భార్య హిమానీ సింగ్ ఓ పాపకు జన్మనిచ్చింది. ఇప్పటికే మొదటి పెళ్లి ద్వారా ప్రభు దేవాకు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.

హిమానీ సింగ్ పాపకు జన్మనిచ్చినట్లు ప్రభు దేవా వెల్లడించాడు. ఈటీ టైమ్స్ అతడు మాట్లాడాడు. "అవును, ఇది నిజం. ఈ వయసులో నేను మరోసారి తండ్రిని అయ్యాను. చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన వ్యక్తిని అయిన ఫీలింగ్ కలుగుతోంది" అని ప్రభు దేవా చెప్పినట్లు ఈటీ టైమ్స్ వెల్లడించింది.

ప్రభు దేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రమలతను తొలి పెళ్లి చేసుకున్న ప్రభు దేవా.. ఆమె ద్వారా ముగ్గురు సంతానాన్ని పొందాడు. వాళ్లంతా అబ్బాయిలే. ఇప్పుడు పాప పుట్టడంతో ఇక తన జీవితంలో చాలా సమయం ఆమెతోనే గడుపుతానని అతడు చెప్పాడు. తనపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకున్నట్లు కూడా తెలిపాడు.

ఫ్యామిలీ, కూతురుతో కలిసి ఎక్కువ సమయంలో గడపాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ అటూఇటూ పరుగెత్తడమే సరిపోయిందని, ఇక పనికి బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడుపుతానని చెప్పాడు. ప్రభు దేవా రెండో భార్య హిమానీ సింగ్.. ఓ ఫిజియో థెరపిస్ట్. ఆమెను 2020లో కొవిడ్ సమయంలో ప్రైవేట్ సెర్మనీలో పెళ్లి చేసుకున్నాడు.

తన వెన్ను నొప్పికి చికిత్స కోసం ఆమె దగ్గరకు వెళ్లిన ప్రభు దేవా.. హిమానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే వీళ్లిద్దరూ కలిసి జంటగా కనిపించారు. ఇంతకుముందు లతను పెళ్లి చేసుకున్న అతడు.. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్నాడు. ఆ తర్వాత నయనతారతోనే రిలేషన్‌షిప్ లో ఉన్నాడు. ఈ కారణంగానే లతతో విడిపోయాడు. ఆ తర్వాత నయనతారతోనూ తెగదెంపులు చేసుకొని హిమానీని పెళ్లి చేసుకున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం