తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Salaar: సలార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Prabhas Salaar: సలార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Hari Prasad S HT Telugu

29 November 2023, 16:36 IST

google News
    • Prabhas Salaar: సలార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పాడు ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ సలార్ మూవీ
ప్రభాస్ సలార్ మూవీ

ప్రభాస్ సలార్ మూవీ

Prabhas Salaar: ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్ కు టైమ్ దగ్గర పడింది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో సలార్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. సలార్ మూవీకి, కేజీఎఫ్ కు ఎలాంటి కనెక్షన్ లేదని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2లతో సలార్ కు లింక్ ఉంటుందని, రాకీ భాయ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే అలాంటిదేమీ లేదని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. "సలార్ నుంచి ప్రేక్షకులు మరో కేజీఎఫ్ ఆశించొద్దు. సలార్ కు తనదైన ఓ సొంత ప్రపంచం ఉంది. దానికి తగిన పాత్రలు, ఎమోషన్ ఉన్నాయి. సలార్ మూవీని ఓ ప్రత్యేకమైన స్టోరీలాగే చూస్తారని భావిస్తున్నాను" అని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అన్నాడు. నిజానికి కేజీఎఫ్ కంటే ముందే సలార్ మూవీ కథ రాసుకున్నట్లు అతడు చెప్పడం విశేషం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే సలార్ మూవీకి ఓ రేంజ్ హైప్ క్రియేటైంది. ఇక సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ లింకు వార్తలు రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు ఊహించినదాని కంటే ఎక్కువే ఉంటాయన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే తాజాగా డైరెక్టర్ కామెంట్స్ తో ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతుందా అన్న ఆందోళన మొదలైంది.

సలార్ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర షారుక్ ఖాన్ డంకీ మూవీతో పోటీ పడబోతోంది. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 22న రిలీజ్ కానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందుకున్న షారుక్ ఖాన్ డంకీతో మరో భారీ ఓపెనింగ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆ ప్రభావం సలార్ వసూళ్లుపై కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.

మరోవైపు హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కు ఈ సలార్ హిట్ అవడం చాలా అవసరం. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా.. ఏదీ వర్కౌట్ కావడం లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాపులతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌డమ్ కు కాస్త దెబ్బ పడింది.

తదుపరి వ్యాసం