Prabhas Maruthi Movie: అఫీషియల్: ప్రభాస్, మారుతి మూవీపై బిగ్ అప్‌డేట్ - టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?
29 December 2023, 10:06 IST
Prabhas Maruthi Movie Update: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ శుక్రవారం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రభాస్
Prabhas Maruthi Movie Update: ప్రభాస్, మారుతి మూవీపై శుక్రవారం మేకర్స్ బిగ్ అప్ డేట్‌ను రివీల్ చేశారు. సంక్రాంతికి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ లుక్‌ను షాడోలో చూపిస్తూ ఓ మల్టీ కలర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో డైరెక్టర్ మారుతి ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది.
కానీ ఇప్పటివరకు ప్రభాస్, మారుతి మూవీకి సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా మేకర్స్ రివీల్ చేయలేదు. ప్రభాస్ మినహా ఇందులో నటిస్తోన్న హీరోయిన్లు, ఇతర నటీనటుల వివరాల్ని సైతం వెల్లడించకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి రోజు టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే అన్నింటిపై ఒకేసారి మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ప్రభాస్, మారుతి మూవీకి రాజా డీలక్స్ అనే పేరు ఖరారు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభాస్, మారుతి మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తోన్నట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏడు రోజుల్లోనే ఈ మూవీ 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీలలో ఒకటిగా నిలిచింది.సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. మారుతి మూవీతో పాటు నాగ్ అశ్విన్‌తో కల్కి 2989 ఏడీ మూవీ చేస్తోన్నాడు ప్రభాస్.
టాపిక్