తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Telugu Rights Price: రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆదిపురుష్ తెలుగు రైట్స్ - ప్ర‌భాస్ కెరీర్‌లో ఇదే హ‌య్యెస్ట్‌

Adipurush Telugu Rights Price: రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆదిపురుష్ తెలుగు రైట్స్ - ప్ర‌భాస్ కెరీర్‌లో ఇదే హ‌య్యెస్ట్‌

HT Telugu Desk HT Telugu

30 May 2023, 11:46 IST

  • Adipurush Telugu Rights Price: ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీ తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా హ‌క్కులు ఎన్ని కోట్ల‌కు అమ్ముడుపోయాయంటే

ప్ర‌భాస్ ఆదిపురుష్
ప్ర‌భాస్ ఆదిపురుష్

ప్ర‌భాస్ ఆదిపురుష్

Adipurush Telugu Rights Price: ప్ర‌భాస్ (Prabhas)హీరోగా న‌టించిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ (Omraut) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ దాదాపు 185 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ పోటీని త‌ట్టుకొని పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోన్న‌ట్లు చెబుతోన్నారు. ప్ర‌భాస్‌ సినిమా కోసం జీఎస్‌టీతో క‌లుపుకొని 200 కోట్ల‌కుపైనే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఖ‌ర్చు చేసిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఇటీవ‌ల కాలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ప్ర‌భాస్ మూవీగా ఆదిపురుష్ నిలిచింది.

తెలుగు స్టేట్స్‌లో త్వ‌ర‌లోనే ఈ సినిమా భారీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జూన్ ఫ‌స్ట్ వీక్‌లో తిరుప‌తిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌రుప‌బోతున్నారు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో లైవ్‌మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌. త్రీడీతో పాటు ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఆదిపురుష్‌లో రాముడిగా ప్ర‌భాస్‌, జాన‌కి పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టించింది. ఈ సినిమా టీజ‌ర్‌పై పెద్ద ఎత్తున ట్రోల్ వ‌చ్చాయి. విజువ‌ల్స్‌, క్యారెక్ట‌ర్ లుక్స్‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. దాంతో వీఎఫ్ఎక్స్‌పై రీ వ‌ర్క్ చేసిన యూనిట్ ట్రైల‌ర్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఇందుకోసం మ‌రో వంద కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసిన‌ట్లు స‌మాచారం. జూన్ 16న తెలుగు, హిందీతో పాటు ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల‌న్నింటిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆదిపురుష్‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడిగా న‌టిస్తోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం