తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Poonam Kaur | ఇకనైనా ప్రశాంతంగా బతకనివ్వండి.. పూనమ్ సంచలన వ్యాఖ్యలు

Poonam Kaur | ఇకనైనా ప్రశాంతంగా బతకనివ్వండి.. పూనమ్ సంచలన వ్యాఖ్యలు

05 May 2022, 16:38 IST

google News
    • పూనమ్ కౌర్ ఇటీవలే ఇద్దరు చిన్నారులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఆ పోస్టుపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. ఇకనైనా ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ నెటిజన్లను కోరింది.
పూనమ్ కౌర్
పూనమ్ కౌర్ (Twitter)

పూనమ్ కౌర్

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్‌ పేరు ఆ మధ్య కాలంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అనేక కామెంట్లు వచ్చాయి. ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం కొనసాగించిందని ఎన్నో రకాల పుకార్లు హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ. తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కింది. పూనమ్ ఇటీవల ఇద్దరు చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోపై నెటిజన్లు విశేషంగా స్పందించారు.

సామాజిక మాధ్యమాల వేదికగా పూనమ్ పంచుకున్న ఫొటోలని పిల్లలు ఎవరంటూ నెటిజన్లు వరుసగా ప్రశ్నలు సంధించారు. ఈ పిల్లలు ఎవర మేడమ్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొంతమంది మాత్రం ఒకడుగు ముందుకు వేసి పూనమ్‌కు పెళ్లైందని, వాళ్లిద్దరూ ఆమె పిల్లలేనని కామెంట్లు చేశారు. ఇందుకు సంబంధించి పలు కథనాలు కూడా హల్‌చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలపై పూనమ్‌కౌర్ స్పందించారు.

"ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టింది చాలు. జరిగిన నష్టం జరిగిపోయింది. వాళ్లిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలు. సోషల్ మీడియాకు ధన్యవాదాలు. ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి." అంటూ పూనమ్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో జరిగిన సంఘటనలు, విశేషాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. కొంతకాలం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం