Pawan Kalyan : పవన్ కల్యాణ్ షూ ధర ఎంతో తెలుసా? ఎక్కడ దొరుకుతాయి 'బ్రో'
28 July 2023, 10:16 IST
- Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను చూడగానే.. చాలా సింపుల్ అనిపిస్తుంది. కానీ ఆయన సింపుల్ గా ఉండేందుకు చాలా డబ్బులు ఖర్చు పెడతారు. నమ్మట్లేదా.. తాజాగా విడుదలైన బ్రో సినిమాలో పవన్ షూ ధర గురించి తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు.
బ్రో సినిమా
చాలా మంది హీరోల బట్టలు చూస్తే వాటి ధర లక్షల్లో ఉంటుందని తెలిసిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాషన్ దుస్తులు ధరించరు. సాధారణ వ్యక్తి ధరించే కుర్తా పైజామా, షర్ట్, ప్యాంటు ధరిస్తాడు. అయితే ఇవి సాదాసీదాగా కనిపించినా.. వీటి ధర చాలా ఎక్కువ. పవన్ బట్టలు, వాచీలు మాత్రమే కాదు.. చెప్పులు, బూట్లు కూడా లక్షల ధరలో ఉంటాయి.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన బ్రో సినిమా(BRO Cinema) విడుదలైంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్ కల్యాణ్ ధరించిన బూట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది ఏ షూ, దాని ధర ఎంత అని వెతుకుతున్నారు. దీని ధర వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి బైక్ దగ్గర ఓ సన్నివేశం ఉంటుంది. అందులో తెలుపు, నలుపు కలగలిసిన షూస్ ధరించాడు పవన్(Pawan Shoes). ఆ బూట్ల అసలు ధర 1.06 లక్షలు. పన్నులు, రవాణా, ఇతరత్రా కలుపుకొంటే 30-40 వేల మేర పెరుగుతుంది. అంటే దాదాపు లక్షా యాభైవేలు వాటి ధర.
‘బ్రో’ సినిమాలో పవన్ కల్యాణ్ మామూలు బూట్లు వేసుకోలేదు. బాల్‌మైన్(Balmain) అనే ప్యారిస్ కంపెనీ తయారు చేసిన డిజైనర్ షూ వేసుకున్నాడు. 78 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ.. బూట్లు, బ్యాగులు, దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ షూల ధర లక్షల్లో ఉంటుంది.
‘బ్రో’ సినిమాలో పవన్ కల్యాణ్ వేసుకున్న షూస్ నచ్చిన నిర్మాత శ్రీనివాసకుమార్ నాయుడు, ఇటీవల తెలుగులో హిట్ అయిన బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ అదే బూట్లను బాల్‌మైన్ నుంచి తీసుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఖరీదైన వస్తువులు ధరించడం కొత్త కాదు. బాల్‌మైన్ షూస్ కంటే ఖరీదైన అనేక ఫ్యాషన్ ఉపకరణాలు పవన్ దగ్గర ఉన్నాయి.
వకీల్ సాబ్ సినిమాలో పవన్ ధరించిన వాచ్ ధర 40 లక్షల రూపాయలు. భీమ్లా నాయక్ సినిమా(Bheemla Nayak) షూటింగ్ సందర్భంగా పవన్ గిరిజన తెగకు చెందిన ఓ గ్రామానికి వెళ్లారు. అప్పుడు ధరించిన బూట్ల ధర దాదాపు 80 వేల వరకు ఉంటుంది. ఇలా చూస్తే.. సింపుల్‌గా కనిపించడం కోసం పవన్ కల్యాణ్ భారీగా ఖర్చు చేస్తున్నాడన్నమాట.