Urvashi Rautela: పవన్ కల్యాణ్‍ను ‘ఏపీ ముఖ్యమంత్రి’ అంటూ పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా: నెటిజన్ల స్పందన ఇదే!-urvashi rautela tweeted calling pawan kalyan the cm of andhra pradesh netizens reacted ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Urvashi Rautela Tweeted Calling Pawan Kalyan The Cm Of Andhra Pradesh Netizens Reacted

Urvashi Rautela: పవన్ కల్యాణ్‍ను ‘ఏపీ ముఖ్యమంత్రి’ అంటూ పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా: నెటిజన్ల స్పందన ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 27, 2023 09:33 PM IST

Urvashi Rautela Tweet: పవన్ కల్యాణ్‍ను ఆంధ్రప్రదేశ్ సీఎం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. బ్రో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది ఊర్వశి.

ఊర్వశి రౌతేలా, సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ (Photo: Instagram/urvashirautela)
ఊర్వశి రౌతేలా, సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ (Photo: Instagram/urvashirautela)

Urvashi Rautela: బ్రో సినిమా రేపు (జూలై 28) థియేటర్లలో గ్రాండ్‍గా విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఈ చిత్రంలో నటించారు. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ పాటలో చిందులు వేసింది. ‘మై డియర్ మార్కండేయ’ అనే స్పెషల్ సాంగ్‍లో ఊర్వశి మెరిసింది. పవర్ స్టార్, సాయి ధరమ్ తేజ్‍తో కలిసి స్టెప్పులు వేసింది. దీంతో బ్రో మూవీ విడుదల నేపథ్యంలో ఊర్వశి నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంట్లో పవన్ కల్యాణ్‍ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఊర్వశి పేర్కొంది. ఊర్వశి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‍తో కలిసి దిగిన ఫొటోను ఊర్వశి రౌతేలా ఇన్‍స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “బ్రో సినిమా కోసం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍తో స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. బ్రో సినిమా రేపు జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తన తప్పులను సరిదిద్దుకునేందుకు చావు తర్వాత రెండో అవకాశం లభించిన వ్యక్తి గురించిన కథే బ్రో మూవీ” అని ఊర్వశి రౌతేలా క్యాప్షన్ పెట్టింది. అయితే, సీఎం..సీఎం అని ప్రజలు అరవటంతో పవన్ కల్యాణ్‍ను ముఖ్యమంత్రి అని ఊర్వశి అనుకుందా.. లేకపోతే కాబోయే సీఎం అని ఆశిస్తూ అలా రాసుకొచ్చిందా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఆమె పోస్ట్ చూసిన పవర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఊర్వశి నిజం చెప్పిందని ఆంధ్రప్రదేశ్‍కు కాబోయే తర్వాతి సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని కొందరు నెటిజన్లు ఈ పోస్టుకు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సీఎం అవడం ఖాయమని ఆయన అభిమానులు రిప్లేలు ఇస్తున్నారు. ఊర్వశి పోస్ట్ స్క్రీన్ షాట్‍ను వైరల్ చేస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి అని, ఈ విషయం ఊర్వశికి తెలియనట్టు ఉందని ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన రాజకీయ పార్టీ జనసేన తరఫున ఆంధ్రప్రదేశ్‍లో వారాహి విజయ యాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైనా.. రాబోయే 2024 ఎలక్షన్లలో జనసేన మంచి ఫలితాలను సాధిస్తుందని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత యాత్రలో ఆయన దూకుడు పెంచారు. మాటల పదును అధికం చేశారు. జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. తనకు సీఎం కావాలన్న ఆకాంక్ష కూడా ఉందని హింట్ ఇచ్చారు.

IPL_Entry_Point