Bro Pre Release Business:బ్రో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే? - పవన్ మూవీ ఓపెనింగ్స్‌పై వర్షం ఎఫెక్ట్ ఉంటుందా?
28 July 2023, 14:18 IST
Bro Movie Pre Release Business: పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ఓపెనింగ్స్‌పై వర్షం ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందంటే...
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ
Bro Movie Pre Release Business: మెగా మామా అల్లుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్‌తేజ్(Saidharam Tej) కాంబోలో ఫస్ట్‌టైమ్ రూపొందిన బ్రో మూవీ శుక్రవారం (జూలై 28న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ దర్శకుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. బ్రో మూవీకి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఛరిష్మా కారణంగా బ్రో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది.
వంద కోట్ల టార్గెట్...
వంద కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ్రో మూవీ రిలీజైంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 98 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నైజాం ఏరియాలోనే థియేట్రికల్ రైట్స్ దాదాపు 30 కోట్ల కు అమ్ముడుపోయినట్లు తెలిసింది. సీడెడ్ 14 కోట్లు, ఓవర్‌సీస్ 12 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.
ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లోనే బ్రో మూవీ థియేట్రికల్ బిజినెస్ 81 కోట్లు చేసినట్లు సమాచారం. థియేటర్స్ ద్వారా వంద కోట్లు కలెక్ట్ చేస్తేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాభాల బాట పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. వంద కోట్ల టార్గెట్‌ను రీచ్ కావడానికి పవన్ ఇమేజ్, క్రేజ్ ఏ మేరకు ఉపయోగపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. స్పెషల్ ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు లేకుండానే నిర్మాతలు బ్రో మూవీని రిలీజ్ చేశారు.
టికెట్ రేట్ల పెంపు వల్ల భారీ బడ్జెట్ సినిమాలకు ఓపెనింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ పెంపు లేకపోవడం బ్రో మూవీ ఫస్ట్ డే గ్రాస్, షేర్స్ మీద ఏ మేరకు ప్రభావం పడనుంది? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. బ్రో మూవీ వరల్డ్ వైడ్‌గా దాదాపు 1600 థియేటర్స్‌లో రిలీజైంది.
వర్షం ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై ఉంటుందా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ కూడా బ్రో మూవీ ఓపెనింగ్స్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే 40 కోట్లకుపైగా గ్రాస్‌ను, ఇరవై కోట్ల వరకు షేర్‌ను కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఊహించని విధంగా వర్షం అడ్డంకిగా మారడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కొంత తగ్గుముఖం పట్టనున్నట్లు చెబుతోన్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు నైజాం ఏరియాలో బాగా పట్టుంది. అతడి గత సినిమాలు భీమ్లానాయక్ (ఫస్ట్ డే పదమూడు కోట్లు), వకీల్‌సాబ్ (ఫస్ట్ డే తొమ్మిదిన్నర కోట్లు) ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఈ సారి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు నైజాం ఏరియాలోని పలు ప్రధాన నగరాల్లో వర్షం భారీగానే పడుతోండటం బ్రో మూవీకి మైనస్‌గా మారింది.
వర్షం కారణంగా బ్రో మూవీ పవన్ కళ్యాణ్ ప్రీవియస్ సినిమాల రికార్డులను దాటడం కష్టమేనని అంటున్నారు. బ్రో మూవీ వరల్డ్ వైడ్‌గా దాదాపు 1500 థియేటర్లలో రిలీజైంది. బ్రో సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా నటించగా ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్ర పోషించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.