OTT Thriller Web Series: ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఐదు రోజుల్లోనే..
04 December 2024, 10:48 IST
- OTT Thriller Web Series: ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. ఈ పీరియడ్ డ్రామా జీ5 ఓటీటీలో ఐదు రోజుల్లోనే అరుదైన రికార్డును అందుకోవడం విశేషం.
ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఐదు రోజుల్లోనే..
OTT Thriller Web Series: థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ కు ఓటీటీలో ఎంత డిమాండ్ ఉంటుందో ఈ మధ్యే వచ్చిన తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి మరోసారి నిరూపిస్తోంది. జీ5 ఓటీటీలో గత గురువారం (నవంబర్ 28) అడుగుపెట్టిన ఈ సిరీస్.. తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో నరేష్ అగస్త్య లీడ్ రోల్లో నటించాడు.
వికటకవి సరికొత్త రికార్డు
జీ5 ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే వికటకవి వెబ్ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ అందుకోవడం విశేషం. ఈ సిరీస్ కు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు తమ వెబ్ సిరీస్ అరుదైన మార్క్ అందుకోవడంతో ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెప్పడానికి వికటకవి టీమ్ మీడియా ముందుకు వచ్చింది.
ఈ సిరీస్ లో నరేష్ అగస్త్య లీడ్ రోల్లో కనిపించగా.. ప్రముఖ సింగర్, నటుడు రఘు కుంచె విలన్ పాత్ర పోషించడం విశేషం. అతని నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సిరీస్ గురించి అతడు స్పందించాడు. "నా పాత్రకు వస్తున్న స్పందన అద్భుతం. క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి ఇలాంటి గొప్ప మాటలు నన్ను చాలా ప్రోత్సహిస్తాయి.
వికటకవిలో ఇంతటి ముఖ్యమైన పాత్రను నాకు ఇచ్చిన జీ5, డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి, రైటర్ తేజకు నా కృతజ్ఞతలు" అని రఘు కుంచె అన్నాడు. అటు డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ అందుకోవడం అరుదని, ఈ సక్సెస్ కు ప్రతి ఒక్కరూ కారణమని అన్నాడు.
వికటకవి కథేంటంటే?
వికటకవి ఓ పీరియడ్ డ్రామా. 1960, 70ల్లో జరిగిన కథగా తెరకెక్కించారు. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల పాటు ఉంటుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మొదటి డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా పేరుగాంచింది. సాధారణంగా ఇలాంటి సిరీస్ లపై ఒకరకమైన క్యూరియాసిటీ ఉంటుంది.
ఈ జానర్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎంత థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ నెరేషన్‌తో తెరకెక్కిస్తే అవి అంత బాగా ఆదరణ పొందుతాయి. ఈ విషయంలో తెలుగులో వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి చాలా వరకు విజయం సాధించిందనే చెప్పుకోవాలి.
వికటకవి కథే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దానికి తెలంగాణ, 1979 బ్యాక్ డ్రాప్ అద్దడం మరింత క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. సిరీస్ లోపలికి వెళ్లేకొద్ది వచ్చే లేయర్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. సాయి తేజ్ రాసుకున్న కథకు ప్రదీప్ మద్దాలి విజన్ తోడై ఎంగేజింగ్‌గా చక్కారు ఈ సిరీస్‌ను. ఎపిసోడ్ ఎండింగ్‌లో మంచి ట్విస్ట్ ఇస్తూ తర్వాతి ఎపిసోడ్‌ను ప్రేక్షకుడు చూసేలా ఎంగేజ్ చేస్తుంది.
కేసులు సాల్వ్ చేసే డిటెక్టివ్‌గా నరేష్ అగస్త్య ఆకట్టుకున్నాడు. నరేష్‌కు నటనపరంగా వికటకవి మరో మంచి సిరీస్ అవుతుంది. మేఘా ఆకాష్ కూడా ఆకట్టుకుంది. రఘు కుంచె, షిజు మీనన్, తారక్ పొన్నప్పతోపాటు మిగతా పాత్రల నటన కూడా సిరీస్‌ను ఎంగేజ్ చేసేలా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్‌తో రెండో సీజన్‌కు హింట్ ఇచ్చారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే మంచి తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్‌ను చూడాలనుకునేవారికి వికటకవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.