తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Crime Thriller: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్

OTT Tamil Crime Thriller: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్

Hari Prasad S HT Telugu

29 October 2024, 7:56 IST

google News
    • OTT Tamil Crime Thriller: తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్ ఉందంటే.. ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.
తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్
తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్

తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.3 రేటింగ్

OTT Tamil Crime Thriller: మీ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల జాబితాలో మరో బ్లాక్ బస్టర్ చేరబోతోంది. ఇదొక తమిళ మూవీ. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన సట్టం ఎన్ కైయిల్ (Sattam En Kaiyil) అనే ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. సాధారణ ప్రేక్షకులు కూడా రేటింగ్ ఇచ్చే ఐఎండీబీలో 9.3 రేటింగ్ ఈ మూవీ సొంతం.

సట్టం ఎన్ కైయిల్ ఓటీటీ రిలీజ్ డేట్

సట్టం ఎన్ కైయిల్.. అంటే చట్టం నా చేతుల్లో ఉంది అని అర్థం. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం.

చాచి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సతీష్ లీడ్ రోల్లో నటించాడు. అజయ్ రాజ్, పావెల్ నవగీతన్, మిమె గోపి, రితికా తమిళసెల్వి, విద్యా ప్రదీప్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాగా.. అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సట్టం ఎన్ కైయిల్ స్టోరీ ఏంటంటే?

సట్టం ఎన్ కైయిల్ మూవీ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చింది. గౌతమ్ అనే ఓ డ్రైవర్ బాగా పొగ మంచు కురుస్తున్న రాత్రి తన కారుతో ఓ బైకర్ ను ఢీకొడతాడు. అతడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ విషయం పోలీసులకు తెలియకుండా ఉండటానికి అతడు శవాన్ని తన కారు డిక్కీలో దాచి పెడతాడు.

ఆ తర్వాత బాగా తాగి తనకు తానుగా డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్టవుతాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతని కారును కూడా సీజన్ చేస్తారు. అందులో శవం ఉన్న విషయం గౌతమ్ కు తప్ప ఎవరికీ తెలియదు. అయితే ఆ బాధితుడు పోలీసులు వెతుకుతున్న వ్యక్తి అని గౌతమ్ కు తెలుస్తుంది.

ఆ హత్య విషయాన్ని దాచి పెట్టడానికి గౌతమ్ చేసిన ప్రయత్నం.. చివరికి అతన్ని ఎలాంటి సమస్యల్లోకి నెట్టింది? కథలో వచ్చే మలుపులు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేస్తాయి. వీటి నుంచి గౌతమ్ బయటపడతాడా లేదా అన్నదే సట్టం ఎన్ కైయిల్ మూవీ కథ.

మొత్తం ఒక రాత్రి జరిగిన స్టోరీగా కాస్త సస్పెన్స్, థ్రిల్ ను జోడించి తీసిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఈ సట్టం ఎన్ కైయిల్ మూవీ నవంబర్ 8 నుంచి తెలుగులోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

తదుపరి వ్యాసం