తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Survival Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT Malayalam Survival Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

05 August 2024, 22:27 IST

google News
    • OTT Malayalam Survival Comedy: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ రాబోతోంది. గుర్ (Grrr) పేరుతో నెలన్నర కిందట రిలీజైన ఈ సినిమా.. త్వరలోనే హాట్‌స్టార్ లోకి రానుంది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT Malayalam Survival Comedy: మలయాళం సినిమాలు అంటే ఇష్టమా? అయితే ఇప్పుడు ఓటీటీలోకి ఓ డిఫరెంట్ జానర్ మలయాళం మూవీ రాబోతోంది. సర్వైవల్ కామెడీ జానర్లో నెలన్నర కిందట థియేటర్లలోకి వచ్చిన గుర్ (Grrr..) మూవీ త్వరలోనే రానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వెల్లడించింది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ మూవీ ఓటీటీలో ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సర్వైవల్ కామెడీ మూవీ

సర్వైవల్ డ్రామా జానర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అలాంటి జానర్ కు కామెడీని జోడించి ఈ గుర్ (Grrr...) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డైరెక్టర్ జై కే తొలిసారి ఓ కామెడీ జానర్లో సినిమా తీశాడు. ఇందులో కుంచకో బొబన్, సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోమవారం (ఆగస్ట్ 5) వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలిపింది.

“త్వరలోనే మీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో గర్జించబోతోంది. గుర్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. అయితే తేదీ మాత్రం వెల్లడించలేదు. జూన్ 15న ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అసలు భిన్నంగా ఉన్న కథే పెద్ద బలం. అయితే దానిని తెరపై ప్రజెంట్ చేసిన విధానం అంత బాగా లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాలో రెజిమోన్ అనే ఓ యువ పారిశ్రామికవేత్తగా కుంచకో నటించాడు. ఓ రాజకీయవేత్త కూతురుని ప్రేమించే అతడు.. ఓరోజు జూలోని ఓ సింహం గుహలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుంటాడు. అతన్ని రక్షించడానికి మొత్తం జూ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

వినడానికి ఈ స్టోరీ భిన్నంగా అనిపించినా.. దీనిని ఆకట్టుకునేలా తెరపైకి తీసుకురాలేకపోయాడు డైరెక్టర్ జై కే. కేవలం కామెడీని పండించడానికే ఎక్కువగా ప్రయత్నించడంతో అసలు స్టోరీ గాడి తప్పింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాలో నిజమైన 8 ఏళ్ల ఓ సింహాన్ని షూటింగ్ కోసం ఉపయోగించడం విశేషం.

హాట్‌స్టార్ మలయాళం మూవీస్

హాట్‌స్టార్ లో ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది రిలీజై మంచి విజయం సాధించిన కామెడీ మూవీ గురువాయూర్ అంబలనడయిల్ మూవీతోపాటు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ఫలిమి, నేరు, అబ్రహం ఓజ్లర్, 12th మ్యాన్, రోమాంచంలాంటి సూపర్ డూపర్ హిట్ మలయాళ సినిమాలు హాట్‌స్టార్ ఓటీటీలో ఉన్నాయి. ఇప్పుడు త్వరలోనే ఈ గుర్ మూవీ కూడా రాబోతోంది.

తదుపరి వ్యాసం