OTT Malayalam Comedy Movie: ఓటీటీలో అదరగొడుతున్న మలయాళం కామెడీ మూవీ.. ముగ్గురు బ్యాచిలర్స్‌తో ఆడ ఏలియన్ కలిస్తే..
28 October 2024, 22:31 IST
- OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత వచ్చిన ఓ హిట్ మలయాళం సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ అదరగొడుతోంది. ముగ్గురు యువకులు, ఓ ఆడ ఏలియన్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ కథ ఇది. ఈ ఏడాది జూన్ లో రిలీజైన ఈ సినిమా క్రియేటివ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన మలయాళం కామెడీ మూవీ.. ముగ్గురు బ్యాచిలర్స్‌తో ఆడ ఏలియన్..
OTT Malayalam Comedy Movie: మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడటానికి ఓ బలమైన కారణమే ఉంది. భిన్నమైన స్టోరీ లైన్, అదిరిపోయే స్క్రీన్ ప్లే, ఊహకందని ట్విస్టులు.. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ.. ఇలా ఏ జానర్ అయినా మలయాళం మూవీస్ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. అలా నాలుగు నెలల కిందట వచ్చిన ఓ మలయాళం మూవీ.. తాజాగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది.
గగనాచారి ఓటీటీ స్ట్రీమింగ్
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ గగనాచారి (Gaganachari). ఈ మూవీ ఈ ఏడాది జూన్ 21న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.
థియేటర్లలో రిలీజైన సమయంలో మూవీకి పెద్దగా రెస్పాన్స్ లేకపోయినా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ తర్వాత మాత్రం అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతం అంటూ ఎక్స్ అకౌంట్లో ట్వీట్స్ చేస్తున్నారు. 2024లో వచ్చిన మరో బెస్ట్ మలయాళం మూవీ అంటూ ఆకాశానికెత్తుతుండటం విశేషం.
ఏంటీ గగనాచారి మూవీ స్టోరీ?
అరుణ్ చందు డైరెక్ట్ చేసిన గగనాచారి మూవీ ఓ సైన్స్ ఫిక్షన్ కామెడీ. దీనికి శివసాయి అందించిన స్క్రీన్ ప్లే చాలా బాగుందంటూ ప్రేక్షకులు అంటున్నారు. ఇది భవిష్యత్తులో అంటే 2043లో జరిగిన స్టోరీగా తీశారు. కేరళలోని ముగ్గురు బ్యాచిలర్స్ అనుకోకుండా ఓ ఆడ ఏలియన్ ను కలుస్తారు.
అప్పటి వరకూ ముగ్గురే ఉన్న ఆ అపార్ట్‌మెంట్ లో ఈ ఏలియన్ రాక ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నది ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. సైన్స్ ఫిక్షన్ కావడంతో అందుకు తగినట్లుగా స్టన్నింగ్ విజువల్స్ తో గగనాచారి మూవీ ఆకట్టుకుంది. కేవలం రూ.4 లక్షల ఓపెనింగ్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ తో మెల్లగా పెరుగుతూ నెల రోజుల్లో రూ.2.2 కోట్లకు చేరింది.
సరదాగా సాగిపోయే సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఓటీటీలో దీనికి మరింత ఆదరణ లభిస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అందుకే ఈ సినిమాకు సురేష్ గోపి మెయిన్ లీడ్ గా ఓ సీక్వెల్ కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ గగనాచారి మూవీ అందుబాటులో ఉంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. కేవలం మలయాళం ఆడియోతోనే ఉన్నా కూడా ఇంగ్లిస్ సబ్ టైటిల్స్ తో చూడాలనుకుంటే చూసే వీలుంది.