OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి కేరళ స్టోరీ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూడొచ్చు
04 October 2024, 14:30 IST
- OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ది కేరళ స్టోరీ హీరోయిన్ అదా శర్మ నటించిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి కేరళ స్టోరీ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూడొచ్చు
OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఈ జానర్ కు చెందిన మరో వెబ్ సిరీస్ రాబోతోంది. గతేడాది ది కేరళ స్టోరీ మూవీతో సంచలన విజయం సొంతం చేసుకున్న అదా శర్మ ఓ లాయర్ గా నటించిన రీటా సాన్యాల్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ను మొబైల్ యాప్ లో ఫ్రీగా చూసే అవకాశం ఉండటం విశేషం.
రీటా సాన్యాల్ ఓటీటీ రిలీజ్ డేట్
అదా శర్మ నటించిన వెబ్ సిరీస్ రీటా సాన్యాల్. ఓ తెలివైన, క్రిమినల్ బ్రెయిన్ ఉన్న లాయర్ రీటా సాన్యాల్ పాత్రలో అదా శర్మ నటించింది. తన తండ్రి హంతకులను పట్టుకునే క్రమంలో బయలుదేరిన ఆమె.. తర్వాత వైల్డ్ గా ఎలా మారిందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. ఈ సిరీస్ అక్టోబర్ 14 నుంచి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఓ హత్య మరికొన్ని హత్యలకు ఎలా దారి తీసింది? ఓ లాయర్ వేర్వేరు వ్యక్తులుగా ఎలా మారింది? ఆ లాయర్ మరో డేంజరస్ లాయర్ తో ఎలా పోటీ పడింది? ప్రపంచాన్ని షాక్ కు గురి చేసే ఆ కేస్ ఏంటి? ఇలా ఈ రీటా సాన్యాల్ ట్రైలర్ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆ ప్రశ్నలకు అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోయే వెబ్ సిరీస్ లో సమాధానాలు దొరకనున్నాయి.
ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. హాట్స్టార్ ట్రైలర్ రిలీజ్ చేసింది. "న్యాయానికి సంబంధించిన ప్రతి ఫైట్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బరిలోకి దిగింది రీటా సాన్యాల్. అక్టోబర్ 14 నుంచి రీటా సాన్యాల్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
అదా శర్మ బోల్డ్ క్యారెక్టర్
ది కేరళ స్టోరీ మూవీ గతేడాది రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. ఆ మూవీలో లీడ్ రోల్ పోషించిన అదా శర్మ.. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఓ బోల్డ్ లాయర్ పాత్ర పోషిస్తోంది. ది కేరళ స్టోరీ మూవీ కేరళలోని అమాయక హిందూ అమ్మాయిలను ఎలా ఇస్లాంలోకి మార్చి ఐసిస్ లోకి తీసుకెళ్తుందో చూపించే ప్రయత్నం చేసింది.
అయితే ఇది కేరళలోని వేల మంది అమ్మాయిల కథ అని మొదట్లో చెప్పిన మేకర్స్.. తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇది మూవీలోని ముగ్గురు అమ్మాయిల కథ అని చెప్పింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత అదా శర్మ బస్తర్ అనే మరో మూవీలోనూ నటించింది. ఇక తాజాగా రీటా సాన్యాల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.