Adah Sharma: హారర్ మూవీతో ఈ వీక్ బాక్సాఫీస్ రేసులో నిలిచిన అదాశ‌ర్మ - ఐదేళ్ల త‌ర్వాత రీఎంట్రీ!-adah sharma horror movie is criminal or devil release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adah Sharma: హారర్ మూవీతో ఈ వీక్ బాక్సాఫీస్ రేసులో నిలిచిన అదాశ‌ర్మ - ఐదేళ్ల త‌ర్వాత రీఎంట్రీ!

Adah Sharma: హారర్ మూవీతో ఈ వీక్ బాక్సాఫీస్ రేసులో నిలిచిన అదాశ‌ర్మ - ఐదేళ్ల త‌ర్వాత రీఎంట్రీ!

Nelki Naresh Kumar HT Telugu
May 23, 2024 12:10 PM IST

Adah Sharma: హార‌ర్ మూవీతో ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకునేందుకు ఆదా శ‌ర్మ రెడీ అయ్యింది. అదాశ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) మూవీ మే 24న రిలీజ్ కాబోతోంది.

 సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌
సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌

Adah Sharma: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో ల‌వ్ మీ, రాజుయాద‌వ్‌తో పాటు ప‌లు మిడ్‌రేంజ్‌, చిన్న సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి. బాక్సాఫీస్ బ‌రిలోకి చివ‌రి నిమిషంలో అదాశ‌ర్మ సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) మూవీ చేరింది. మే 24న క్రిమిన‌ల్ ఆర్ డెవిల్ (సీడీ) మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సీడీ మూవీతో దాదాపు ఐదేళ్ల‌ త‌ర్వాత అదాశ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

సెన్సార్ కంప్లీట్‌...

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల‌తో సీడీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో అదాశ‌ర్మ‌తో పాటు విశ్వాంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. సీడీ మూవీతో కృష్ణ అన్నం డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ,సీడీ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికేట్ వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. .

క్రిమిన‌ల్‌ ఆర్ డెవిల్‌...

సీడీ మూవీలో అదాశ‌ర్మ రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. క్రిమిన‌ల్‌గా, డెవిల్‌గా ఆమె క్యారెక్ట‌ర్‌లో వేరియేష‌న్స్ ఉన్న‌ట్లుగా టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ చూస్తుంటే క‌నిపిస్తోంది.

ఓ యువ‌కుడి ద‌య్యం ఎందుకు వెంటాడింది? అత‌డిని చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించింది అనే అంశాల‌తో ఈ మూవీ ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. యాక్టింగ్ ప‌రంగా అదాశ‌ర్మ‌లోని కొత్త కోణాన్ని ఈ మూవీ చూపిస్తుంద‌ని అంటున్నారు. సీడీ మూవీకి సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు.

రాజ‌శేఖ‌ర్ క‌ల్కి త‌ర్వాత‌...

2019లో రిలీజైన రాజ‌శేఖ‌ర్ క‌ల్కి త‌ర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది అదాశ‌ర్మ‌. సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్) మూవీతో దాదాపు ఐదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

కేర‌ళ స్టోరీ 300 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

2023లో రిలీజైన ది కేర‌ళ స్టోరీ మూవీతో కెరీర్‌లోనే అతి పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది అదాశ‌ర్మ‌. కేర‌ళ‌లో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్ ది కేర‌ళ స్టోరీని తెర‌కెక్కించారు. చిన్న సినిమాగా రిలీజైన కేర‌ళ స్టోరీ 300 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. గ‌త ఏడాది బాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తొమ్మిదో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

కేర‌ళ‌లో క‌నిపించ‌కుండా పోతున్న అమ్మాయిలు ఎలా ఐసిస్‌లో చేరుతోన్నారు? ఆ అమాయ‌కుల‌ను మ‌త‌మార్పిల‌కు పోత్స‌హిస్తూ ఉగ్ర‌వాద సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌కు ఎలా వాడుకుంటున్నాయ‌న్న‌ది ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించిన తీరుపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లొచ్చాయి.

ఓ వైపు వెబ్‌సిరీస్‌లు...

ది కేర‌ళ స్టోరీ త‌ర్వాత ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్‌తో బ‌స్త‌ర్ అనే సినిమా చేసింది. ఇందులోనూ ఓ ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించింది. ఓవైపు సినిమాల‌పై ఫోక‌స్ పెడుతూనే వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తోంది. తెలుగులో మీట్ క్యూట్ అనే వెబ్‌సిరీస్ చేసింది. క‌మాండో, ఐసా వైసా ప్యార్‌తో పాటు మ‌రికొన్ని సిరీస్‌ల‌లో కామెడీ ప్ర‌ధాన పాత్ర‌లు చేసింది.అదా శ‌ర్మ లీడ్ రోల్‌లో న‌టించిన స‌న్ ఫ్ల‌వ‌ర్ వెబ్‌సిరీస్ ఇటీవ‌ల జీ5 ఓటీటీలో రిలీజైంది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్