Bastar Teaser: కేరళ స్టోరీ తర్వాత మరో కాంట్రవర్సీయల్ మూవీతో రాబోతున్న అదాశర్మ - బస్తర్ టీజర్ రిలీజ్
Bastar Teaser: ది కేరళ స్టోరీ తర్వాత అదాశర్మ హీరోయిన్‌గా నటించిన బస్తర్ మూవీ మార్చి 15న రిలీజ్ అవుతోంది. నక్సలిజం సమస్యతో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Bastar Teaser: ది కేరళ స్టోరీ తర్వాత మరో కాంట్రవర్సీయల్ మూవీకి అదాశర్మ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో బస్తర్ అనే మూవీ చేస్తోంది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కేవలం అదాశర్మ తప్ప మిగిలిన నటీనటులు ఎవరిని చూపించలేదు. బస్తర్ మూవీలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది.
నక్సలైట్లతో పోరాటం…
నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ టీజర్‌లో ఆసక్తిని పంచుతోన్నాయి. బోర్డర్‌లో పాకిస్థాన్‌తో పోరాడుతూ కన్నుమూసిన జవాన్ల కంటే నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువ అంటూ టీజర్‌లో ఇంటెన్స్‌గా అదాశర్మ డైలాగ్స్ చెప్పడం ఆకట్టుకుంటోంది.
బస్తర్‌లో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్‌లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. నక్సలిజం సమస్య చర్చిస్తూ సింగిల్ టేక్‌లో అదాశర్మ డైలాగ్స్‌తో టీజర్‌ను కట్ చేయడం ఉత్కంఠను పంచుతోంది.
కేరళ స్టోరీ డైరెక్టర్...
ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. బస్తర్ టైటిల్‌కు ది నక్సల్ స్టోరీ అనే క్యాప్షన్‌ను జోడించారు. చత్తీస్‌ఘడ్‌లో బస్తర్ ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో అదాశర్మ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.
కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ సీరియల్ క్యారెక్టర్‌లో ఆమె కనిపిస్తోన్న మూవీ ఇదే అని చెబుతోన్నారు. బస్తర్ మూవీకి ది కేరళ స్టోరీకి పనిచేసిన సాంకేతిక నిపుణులే పనిచేయబోతున్నారు. కేరళ స్టోరీని నిర్మించిన విపుల్ అమృత్‌లాల్ షా బస్తర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
బస్తర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే...
మార్చి 15న పాన్ ఇండియన్ లెవెల్‌లో బస్తర్ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ భావిస్తున్నారు. హిందీతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బస్తర్ సినిమా సెన్సార్ అడ్డంకులను దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పాటిలిక్స్, నక్సలిజంపై చాలా కంట్రావర్సీయల్ డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బస్తర్ సినిమాలో రైమాసేన్, యశ్పాల్ శర్మ కీలక పాత్రలు పోషించబోతున్నారు.
ది కేరళ స్టోరీ...
అదాశర్మ, సుదీప్తో సేన్ కాంబినేషన్‌లో రూపొందిన ది కేరళ స్టోరీ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వివాదాలతో సంబంధం లేకుండాబాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టింది. గత ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
వివాదాల కారణంగా ఈ మూవీ ఇప్పటివరకు ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. త్వరలోనే జీ5 ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు కేరళ స్టోరీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.