తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Drama: నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTT Comedy Drama: నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Hari Prasad S HT Telugu

27 September 2024, 17:48 IST

google News
    • OTT Comedy Drama: 35 చిన్న కథ కాదు.. నివేదా థామస్ నటించిన సూపర్ హిట్ కామెడీ డ్రామా. ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఆహా వీడియో ఓటీటీ మొత్తానికి శుక్రవారం (సెప్టెంబర్ 27) మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. నివేదా థామస్ సూపర్ హిట్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTT Comedy Drama: నివేదా థామస్, ప్రియదర్శి నటించిన సూపర్ హిట్ కామెడీ డ్రామా 35 చిన్న కథ కాదు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా వీడియో కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చి మొత్తానికి డేట్ అనౌన్స్ చేసింది. వచ్చే వారం ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

35 చిన్న కథ కాదు ఓటీటీ రిలీజ్ డేట్

35 చిన్న కథ కాదు మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో శుక్రవారం (సెప్టెంబర్ 27) అనౌన్స్ చేసింది. అంతకు కొన్ని గంటల ముందే త్వరలోనే అంటూ ఊరించిన సదరు ఓటీటీ.. సాయంత్రానికి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసింది.

"ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది.. మన ఇంటి కథలా అనిపిస్తుంది.. బ్యూటీఫుల్ బ్లాక్‌బస్టర్ 35 మూవీ అక్టోబర్ 2న కేవలం ఆహాలోనే ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం కొన్ని రోజులుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

35 చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందంటే?

35 - చిన్న కథ కాదు సినిమాను ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు నందకిశోర్ ఇమానీ. మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ మార్కులు తెచ్చుకునేలా తన కుమారుడికి ఓ తల్లి స్ఫూర్తి కలిగించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కథ సింపుల్‍గానే ఉన్నా.. హృదయాలను హత్తుకునేలా డైరెక్టర్ చూపించారు. మధ్య తరగతి కుటుంబ పరిస్థితులు, పిల్లల్లో ఉండే సందేహాలు, విద్యావ్యవస్థ ఇలా చాలా అంశాలను చూపించారు.

35 - చిన్న కథ కాదు మూవీలో నివేదా థామస్‍తో పాటు విశ్వదేవ్ రాచకొండ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. ఉపాధ్యాయుడిగా నటించిన ప్రియదర్శి మరోసారి తన నటనతో మెప్పించారు. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్‍దేవ్ కూడా ఆకట్టుకున్నారు. అభయ్ శంకర్, గౌతమి, కృష్ణతేజ, భాగ్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు.

35 - చిన్న కథ కాదు చిత్రాన్ని సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ప్రొడ్యూజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పించారు. ఈ మూవీ ప్రమోషన్లలోనూ రానా జోరుగా పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు.

తదుపరి వ్యాసం