తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr: గే లవ్‌స్టోరీ అంటూ ఆర్ఆర్‌ఆర్‌పై నోరు పారేసుకున్న ఆస్కార్‌ విన్నర్‌

RRR: గే లవ్‌స్టోరీ అంటూ ఆర్ఆర్‌ఆర్‌పై నోరు పారేసుకున్న ఆస్కార్‌ విన్నర్‌

HT Telugu Desk HT Telugu

05 July 2022, 15:51 IST

google News
    • RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై ఆస్కార్‌ విన్నర్‌ సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్‌ పుకుట్టి నోరు పారేసుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి ప్రొడ్యూసర్‌తోపాటు ఫ్యాన్స్‌ దిమ్మదిరిగే సమాధానం ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు.
ఆస్కార్ విన్నర్ రసూల్ పుకుట్టి
ఆస్కార్ విన్నర్ రసూల్ పుకుట్టి (Twitter)

ఆస్కార్ విన్నర్ రసూల్ పుకుట్టి

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌ మూవీపై హాలీవుడ్‌ స్థాయిలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మధ్యే హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్‌ సినిమా కూడా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తీసిన విధానంపై ఎంతో మంది హాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

అయితే స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌తో ఆస్కార్‌ అందుకున్న సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్ పుకుట్టి మాత్రం ఈ సినిమాపై నోరు పారేసుకున్నాడు. ఇదొక గే లవ్‌స్టోరీ అంటూ తీవ్రంగా అవమానించాడు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ రసూల్‌ ఇలా కామెంట్ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే ఓ చెత్తను అరగంట పాటు చూశాను అంటూ ఓ వ్యక్తి ట్వీట్‌ చేశాడు.

దీనికి రసూల్‌ రిప్లై ఇస్తూ గే లవ్‌ స్టోరీ అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అయితే ఘాటుగా స్పందించాడు. "ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ గే లవ్‌ స్టోరీ అని అనుకోవడం లేదు. ఒకవేళ గే లవ్‌ స్టోరీ అయినా కూడా అందులో తప్పేముంది. నీలాంటి ఎంతో సాధించిన వ్యక్తి ఇంత దిగజారుతాడని అనుకోలేదు" అంటూ కాస్త గట్టిగానే బదులిచ్చాడు.

దీనికి రసూల్‌ స్పందిస్తూ.. "పూర్తిగా అంగీకరిస్తున్నా. ఒకవేళ అది అయినా కూడా తప్పేమీ లేదు. ఇప్పటికే జనంలో అనుకుంటున్నది మాత్రమే నేను కోట్‌ చేశాను. ఇందులో దిగజారేది ఏమీ లేదు. నువ్వు అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు శోభు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు" అని అన్నాడు. దీనిపైనా అభిమానులు మండిపడ్డారు.

ఎవరో అన్నారని నువ్వు కూడా ఆర్ఆర్‌ఆర్‌ను గే లవ్‌ స్టోరీ అంటావా అంటూ రసూల్‌ను ట్రోల్‌ చేశారు. ఈ మూవీలో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మధ్య స్నేహాన్ని రాజమౌళి ఎంతో అందంగా చూపించారు. దీనిపైన కొందరు సోషల్‌ మీడియాలో పనిగట్టుకొని గే లవ్‌స్టోరీ అంటూ విమర్శించారు. అయితే రసూల్‌లాంటి ఆస్కార్‌ విన్నర్‌ కూడా ఇలా చేయడమేంటని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

తదుపరి వ్యాసం